సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అర్థరాత్రి ఆటలాడుతున్న Vicky Kaushal.. తన టీంతో కలిసి..

ABN, First Publish Date - 2022-04-13T16:20:07+05:30

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ‘ఉరి’ సినిమాతో పాపులారిటీ సాధించిన ఈ నటుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ‘ఉరి’ సినిమాతో పాపులారిటీ సాధించిన ఈ నటుడు అనంతరం కూడా మంచి మూవీస్‌ చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఈ యువ నటుడికి సినిమాలతోపాటు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. అందుకే షూటింగ్ మధ్యలో ఏ మాత్రం సమయం దొరికినా తన టీంతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. తాజాగా సైతం విక్కీ క్రికెట్ అడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


విక్కీ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో మిడ్ నైట్ క్రికెట్ ఆడిన వీడియోను షేర్ చేశాడు. దానికి.. ‘టీంతో అర్థరాత్రి గేమ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అందులో ఆయన షాట్ కొట్టగా.. అందరూ క్లాప్ కొడుతున్నట్లు సౌండ్స్ వినిపించాయి. ఆయన క్రికెట్ ఆడుతున్న వీడియోలు  నెట్టింట వైరల్‌ కావడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలోనూ మూవీ టీంతో కలిసి క్రికెట్ ఆడిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై పలువురు విక్కీ అభిమానులు ‘సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-13T16:20:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!