Prabhas: ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్న కృతి సనన్.. హింట్ ఇచ్చిన బాలీవుడ్ యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-11-28T19:22:40+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే...

Prabhas: ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్న కృతి సనన్.. హింట్ ఇచ్చిన బాలీవుడ్ యంగ్ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్టార్స్ ఇద్దరు కలిసి ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఈ జంట మధ్య ఏదో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ ఈ వార్తలపై వారిద్దిరిలో ఎవరూ స్పందించలేదు. కానీ ‘భేడియా’ (తెలుగులో తోడేలు) సినిమాలో కృతితో కలిసి నటించిన వరుణ్ ధావన్ (Varun Dhawan) వీరి రిలేషన్‌షిప్‌పై స్పందించాడు.


‘భేడియా’ ప్రమోషన్స్‌లో భాగంగా కృతి, వరుణ్ ఓ రియాలిటీ షో పాల్గొన్నారు. ఆ షోలో వరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కృతి మనసులో వేరొకరు ఉన్నారు. అతను ప్రస్తుతం ముంబైలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. వరుణ్ మాటలు విని కృతి సనన్ నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన పలువురు బీటౌన్‌ నెటిజన్లు వరుణ్‌ మాట్లాడుతుందోనని ప్రభాస్‌ గురించేనని అందరూ అనుకుంటున్నారు.  


అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ..‘కార్తీక్ ఆర్యన్‌తో ప్లర్ట్ చేస్తాను. టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తాను. ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే పలు ఇంటర్వ్యూలలో ప్రభాస్‌ అంటే తనకిష్టమని, ఆయన్ని అభిమానిస్తున్నానంటూ  చెప్పింది. అలాగే ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె‌’ షూటింగ్ చేస్తున్నాడు. అందులో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్‌ ధావన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



Updated Date - 2022-11-28T19:22:40+05:30 IST