Cannes film festival 2022: వైట్గౌనుతో ఆకట్టుకున్న ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్ క్వీన్ అంటూ..
ABN, First Publish Date - 2022-05-19T18:59:08+05:30
మాజీ మిస్ దివా యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని...
మాజీ మిస్ దివా యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటు వెళుతోంది. 2015లో దివ మిస్ యూనివర్స్‌గా గెలిచి.. అదే ఏడాది మిస్ యూనివర్స్ (Miss Diva Universe)లో భారత దేశం తరుఫున పాల్గొన్న ఈ భామ కొన్ని నెలల క్రితం నిర్వహించిన మిస్ యూనివర్స్ 2021 పోటీలకు జడ్జిగా వ్యవహరించింది. ఈ బ్యూటీ తాజాగా మరో ఫీట్ సాధించింది. అంతర్జాతీయంగా పేరుగాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో భారత దేశం తరుఫున ఇతర సినీ సెలబ్రిటీలతో కలిసి పాల్గొంది.
ఆ వేడుకల్లో భాగంగా తాజాగా జరిగిన కార్యక్రమంలో ఊర్వశి రెడ్ కార్పెట్‌పై నడిచింది. దీనికి సంబంధించిన పిక్స్‌ని ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్‌కి.. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022.. కల నేరవేరింది. యూనివర్స్‌కి ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అందులో.. అంతర్జాతీయ ఏస్ డిజైనర్ టోనీ వార్డ్ కోచర్ వార్డ్ రోబ్ నుంచి ఎంచుకున్న తెల్లటి గౌనులో ఊర్వశి మెరిసిపోయింది. ఆ గౌనుపై చాలా తక్కువ డిజైన్ మాత్రమే ఉంది. అయితే చూడటానికి మాత్రం ఎంతో అందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఎంతోమంది నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే బెస్ట్ డ్రెస్సింగ్.. లవ్ యూ.. బాలీవుడ్ క్వీన్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే.. ‘ఎంతో అందంగా ఉన్నావు’, ‘సేల్ఫ్ మేడ్ క్వీన్’, ‘సూపర్’, ‘దేవతలా ఉన్నావు’ అంటూ వరుసగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కాగా.. ఇండియన్ పెవిలియన్ ఆఫ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో భాగంగా తన బహుభాషా చిత్రం ‘ది లెజెండ్’ పోస్టర్‌ను ఊర్వశి రౌతేలా ఆవిష్కరించనుంది.