సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘సెక్స్ అప్పీల్’ కొంపముంచిందంటోన్న ‘Rangeela’ బ్యూటీ!

ABN, First Publish Date - 2022-01-31T02:03:23+05:30

ఊర్మిళ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే చిత్రం... ‘రంగీలా‘. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆల్ టైం రొమాంటిక్ క్లాసిక్ ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా, ఆ సినిమాలో ఊర్మిళ చేసిన అందమైన శృంగార మాయాజాలం అంతా ఇంతా కాదు. కానీ, అప్పట్లో సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా తనకు తగినంత గుర్తింపు మాత్రం దక్కలేదంటోంది ఊర్మిళ!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊర్మిళ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే చిత్రం... ‘రంగీలా‘. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆల్ టైం రొమాంటిక్ క్లాసిక్ ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా, ఆ సినిమాలో ఊర్మిళ చేసిన అందమైన శృంగార మాయాజాలం అంతా ఇంతా కాదు. కానీ, అప్పట్లో సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా తనకు తగినంత గుర్తింపు మాత్రం దక్కలేదంటోంది ఊర్మిళ! 


ఆమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ లాంటి నటులు ఉన్నా కూడా ‘రంగీలా’ సినిమా కథ మొత్తం హీరోయిన్ ఊర్మిళ చుట్టూనే తిరుగుతుంటుంది. నటి అవ్వాలని తాపత్రయపడే అప్‌కమింగ్ యాక్ట్రస్‌గా ఆమె నటన అద్భుతమే. కానీ, ఆర్జీవీ మార్కు రొమాంటిక్ సాంగ్స్‌లో ఆమె హావభావాలు, నాట్యం మతిపొగొట్టేస్తాయి. ఆ సెక్స్ అప్పీలే సినిమా ఘన విజయం సాధించాక కూడా ఊర్మిళకి నష్టం చేసిందట! 


అలనాటి అందమైన వెండితెర శృంగార కావ్యం గురించి తాజాగా మాట్లాడిన ఊర్మిళ, ‘‘... ‘హై రామా’ లాంటి పాట రక్తికట్టాలంటే నటన రాకపోతే ఎలా కుదురుతుంది? సెక్సీగా కనిపించటం కూడా నటనే కదా...’’ అంటోంది. కానీ, ‘రంగీలా‘ విడుదల తరువాత తన ప్రతిభని ఎవ్వరూ గుర్తించలేదని ఆమె వాపోయింది. ‘ఒక్క గౌరవప్రదమైన మాట’ కూడా విమర్శకులు తన కోసం వాడలేదని వ్యాఖ్యానించింది. తన నటనని ‘సెక్స్ అప్పీల్’ అంటూ కొట్టిపారేశారనని ఊర్మిళ బాధపడింది. అంతే కాదు, అప్పట్లో వరుసగా 13 ఫ్లాపులిచ్చిన హీరోయిన్స్‌ని, అమ్మాయిల్లా ఎంత మాత్రం కాక అబ్బాయిల్లా కనిపించే హీరోయిన్స్‌ని, హీరోలతో కలసి బూతు పాటలకు స్టెప్పులేసిన కథానాయికల్ని కూడా నటీమణులంటూ మెచ్చుకున్నారని ఆమె గుర్తు చేసుకుంది! వారెవరో పేర్లైతే చెప్పలేదుగానీ... తాను శృంగారం పండించే పాత్రల్లో అద్భుతంగా నటించానని ఊర్మిళ తేల్చి చెప్పింది. నటన అంటే కేవలం కన్నీళ్లు పెట్టించే బరువైన పాత్రలు మాత్రమే కాదని ఆమె ప్రత్యామ్నాయా నిర్వచనం అందించింది! అదీ నిజమే మరి... 

Updated Date - 2022-01-31T02:03:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!