అది జరగకపోతే ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-04-08T15:36:10+05:30 IST

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా గుర్తింపు పొందిన బ్యూటీ ఉర్ఫీ జావేద్. ఈ భామ సినిమాలు, నటనతో కంటే సోషల్ మీడియాలోనే..

అది జరగకపోతే ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా గుర్తింపు పొందిన బ్యూటీ ఉర్ఫీ జావేద్. ఈ భామ సినిమాలు, నటనతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో పిక్స్ అప్‌లోడ్ చేస్తుంటుంది. వాటి వల్ల ఎక్కువ సార్లు ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇన్ని సంవత్సరాల యాక్టింగ్ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న  భయంకరమైన పరిస్థితుల గురించి తెలిపింది. 


ఉర్ఫీ మాట్లాడుతూ.. ‘నేను చాలా ఏళ్లుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను. ఇదో విషపూరితమైన వాతావరణం. ఎన్నో కష్టాల తర్వాత ప్రస్తుతం ఇక్కడ, ఇలా ఉన్నాను. అయితే ఇదే గనక జరగకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. కానీ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని చిన్న పాత్రలు చేశాను’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.


ఇటీవలే సుస్సేన్ ఖాన్ సోదరి ఫరా ఖాన్ అలీ, కాష్మేరా షా ఉర్ఫీ డ్రెస్సింగ్‌పై విమర్శలు చేశారు. ఆ కామెంట్స్ గురించి ఈ భామ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో బ్లూటిక్ ఉన్న ఎంతోమంది సినీ, టీవీ నటులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు నా వైరల్ చిత్రాలపై విమర్శలు చేస్తుంటారు. వారు అసహ్యం, అసభ్యం అంటూ కామెంట్స్ పెడుతుంటారు. అవి చూస్తే వారికి నాతో ఉన్న సమస్యెంటో అర్థం కాదు’ అని తెలిపింది.


డ్రెస్సింగ్ గురించి ఉర్ఫీ మాట్లాడుతూ.. ‘నేను లక్నోలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాగే దుస్తులు ధరించేదాన్ని. పైన ఫుల్ స్లీవ్స్ జాకెట్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లగానే దాన్ని తీసేసేదాన్ని. నా డ్రెస్సింగ్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నన్ను వారు అసహ్యించుకుంటారు. ద్వేషిస్తారు. అయినప్పటికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారి మాటలను పట్టించుకొని ఎందుకు బాధ పడాలి. ఇంకా చెప్పాలంటే.. వాళ్లు నన్ను అలా అసహ్యించుకుంటూ, ద్వేషిస్తుంటేనే.. నాకెంతో మంచిది’ అని పేర్కొంది.

Updated Date - 2022-04-08T15:36:10+05:30 IST

Read more