‘ఆమెని ఎవరికైనా చూపించండ్రా’.. Urfi Javedని ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-07-08T19:34:31+05:30 IST

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. ఆ షోతో వచ్చిన ఫేమ్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో..

‘ఆమెని ఎవరికైనా చూపించండ్రా’.. Urfi Javedని ఆడేసుకుంటున్న నెటిజన్లు

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). ఆ షోతో వచ్చిన ఫేమ్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవర్స్‌ని సాధించుకుంది. అంతేకాకుండా.. ఈ బ్యూటీ ప్రత్యేక డ్రెస్సింగ్ స్టైల్‌తో సైతం మంచి గుర్తింపును పొందింది. అలాగే.. ఈ భామ ఏ విషయం గురించైనా ఎటువంటి బేషజం, మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. అయితే.. ఆమె మాటలు, చేతలతో కొన్నిసార్లు విమర్శలు పాలవుతూ ఉంటుంది. తాజాగా సైతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో హల్‌చల్ చేస్తోంది.


ఆ వీడియోలో సోషల్ మీడియా రిపోర్టర్ ఉర్ఫీని ముంబైలో వర్షాల గురించి అడిగాడు. ‘మీకు వర్షాకాలం అంటే ఇష్టమా?’ అని అడగగా.. ‘నాకు స్నానం చేయాలంటే నచ్చదు. ఇంకా వర్షాకాలం అయితే చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను చాలా సోమరిని. అది వర్షాకాలంలోనే కాదు. ప్రతి రోజూ అలాగే బద్ధకంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ బ్యూటీని ట్రోల్ చేయడం ప్రారంభించారు.


‘ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం చేయట్లేదు’ అని ఓ నెటిజన్.. ‘అంటే ఇప్పుడు కూడా స్నానం చేయలేదా’ అంటూ మరొకరు.. ‘అంటే బయటికి వచ్చినప్పుడు ఫెర్‌ఫ్యూమ్ వాడతావా?’ అని ఇంకొకరు.. ‘చోటీ రాఖీ సావంత్’, ‘ఎవరికైనా చూపించండి’ అంటూ విపరీతంగా విమర్శలు చేశారు. కాగా.. ఇటీవలే జరిగిన ఉదయ్‌పూర్ టైలర్ హత్య గురించి సోషల్ మీడియా ద్వారా ఈ భామ స్పందించింది. దేవుడు పేరుతో ఇలాంటి పనులు చేయడం దారుణం అంటూ కామెంట్స్ చేసింది. దానిపై ఓ వ్యక్తి స్పందిస్తూ చంపేస్తామని బెదిరింపులకి దిగాడు. దాన్ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉర్ఫీ కేసు పెడతానని తెలిపింది. అలాగే ఆలియా భట్ ప్రెగ్నెన్సీ వంటి పలు అంశాలపై ఎటువంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను షేర్ చేసింది.Updated Date - 2022-07-08T19:34:31+05:30 IST

Read more