Twinkle Khanna: ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు.. తండ్రిపై బాలీవుడ్ నటి ఎమోషనల్ పోస్ట్
ABN, First Publish Date - 2022-07-19T18:56:33+05:30
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరుపొందిన దివంగత నటుడు రాజేశ్ ఖన్నా (Rajesh Khanna). పలు ఐకానిక్ బాలీవుడ్ చిత్రాలు..
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరుపొందిన దివంగత నటుడు రాజేశ్ ఖన్నా (Rajesh Khanna). పలు ఐకానిక్ బాలీవుడ్ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. అందుకే ఈ దివంగత లెజెండరీ స్టార్‌ను ఆయన అభిమానులు, పరిశ్రమలోని మిత్రులు ‘కాకా’ అని ఎంతో ప్రేమగా పిలుచుకునే వారు. అంతటి టాలెంట్ ఉన్న ఈ నటుడు క్యాన్సర్‌తో పోరాడుతూ జూలై 18, 2012న కన్నుమూశారు. 1969 నుంచి 71 మధ్య కేవలం మూడేళ్లలో 17 వరుస సూపర్ హిట్‌లను అందించారు. ఇందులో వరుసగా 15 సోలో హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.
జూలై 18న ఆయన 10వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె తండ్రితో ఉన్న జ్ఞాపకాలను ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంది. త్రండితో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దానికి.. ‘10 ఏళ్లు. ఆయన ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. మా హృదయాల్లో ఉన్నారు’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఈ తండ్రికూతుళ్లకి ఓ కామన్ పాయింట్ ఉంది. అదే ఈ ఇద్దరి పుట్టిన రోజు డిసెంబర్ 25 కావడమే. గతేడాది సైతం వారి పుట్టిన రోజు సందర్భంగా తండ్రి గురించి ఓ భావోద్వేగ పోస్టుని షేర్ పంచుకుంది. కాగా.. బాలీవుడ్‌తోపాటు ఇతర ప్రాంతీయ భాష చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar)ని పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాలు మానేసి రచయిత్రిగా మారింది. ఆమె రాసిన పలు పుస్తకాలు విడుదలై మంచి ఆదరణ పొందాయి.