సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తెర మీదకు టాటాల కథ

ABN, First Publish Date - 2022-05-25T21:08:28+05:30

ఉప్పు, పప్పుల నుంచి సాఫ్ట్‌వేర్ సేవల వరకు అన్ని రంగాల్లో ఉన్న దిగ్గజ సంస్థ టాటా. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్‌నకు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో టాటాల కథ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పు, పప్పుల నుంచి సాఫ్ట్‌వేర్ సేవల వరకు అన్ని రంగాల్లో ఉన్న దిగ్గజ సంస్థ టాటా. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్‌నకు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో టాటాల కథ తెర మీదకు తీసుకువస్తున్నారు. టి-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ (Almighty Motion Picture) ఈ బిజినెస్ ఫ్యామిలీ కథను తెర మీద ఆవిష్కరించనుంది. జర్నలిస్ట్ గిరిశ్ కుబేర్ (Girish Kuber) రచించిన ‘ద టాటాస్: హౌ ఏ ప్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్’(The Tatas: How A Family Built A Business And A Nation) పుస్తకం ఆధారంగా టాటాల కథను స్క్రీన్ మీద చూపించనున్నారు.

 

టాటాల కథను తెర మీదకు తీసుకువస్తున్న విషయాన్ని టి-సిరీస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. టాటాల స్టోరీని సినిమాగా తీసుకువస్తారా, వెబ్‌సిరీస్‌గా తెరకెక్కిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, మల్టీ సీజన్ వెబ్‌సిరీస్‌గా నిర్మించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్మైటీ మోషన్ పిక్చర్ ప్రతినిధి ప్రభలీన్ కౌర్ మూడు సీజన్స్‌గా తెరకెక్కిస్తామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘బిజినెస్ సామ్రాజ్యాన్ని టాటాలు ఏ విధంగా నిర్మించారనేది చూపించడంతో పాటు, దేశానికి వారు అందించిన సేవలను తెరపై ఆవిష్కరిస్తాం. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా(Ratan Tata), ఆయన పూర్వీకుల కథను మీరు చూడవచ్చు’’ అని ప్రభలీన్ కౌర్ చెప్పారు.



Updated Date - 2022-05-25T21:08:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!