సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaitanya: సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయాన్ని సందర్శించిన నాగ చైతన్య

ABN, First Publish Date - 2022-08-04T23:02:06+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కార్యాలయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తాజాగా సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కార్యాలయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తాజాగా సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను చై తాజాగా మీడియాకు వివరించాడు. సంజయ్ లీలా భన్సాలీతో కలసి పనిచేసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్టు నాగ చైతన్య పేర్కొన్నాడు. 


అక్కినేని నాగచైతన్య తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)లో నటించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్‌లో కొంచెం విరామం లభించడంతో భన్సాలీ కార్యాలయాన్ని సందర్శించాడు. అందుకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. ‘‘అది సాధారణ సమావేశమే. కొంత మంది ఫిల్మ్ మేకర్స్ అంటే నాకు చాలా ఇష్టం. వారు ఎప్పుడు, ఎక్కడ కనిపించినా పలకరిస్తుంటాను. వారితో కలసి పనిచేసే అవకాశం వస్తుందనుకుంటున్నాను. బాలీవుడ్‌లో ఉన్న అనేక మంది ఫిల్మ్ మేకర్స్‌తో నేను పనిచేయాలనుకుంటున్నాను. సినిమా విడుదల అనంతరం నేను ప్రేక్షకులకు నచ్చితే ఇక్కడి ఫిల్మ్ మేకర్స్‌తో కలసి నేను పనిచేస్తాను. ‘లాల్ సింగ్ చడ్డా’ లో నా పాత్ర ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ అవుతుందో అని నేను ఎదురుచూస్తున్నాను’’ అని నాగ చైతన్య తెలిపాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ లో నాగ చైతన్య బోడి బాలరాజు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించారు. కానీ, ఏమైందో తెలియదు కానీ విజయ్ ఈ చిత్రం నుంచి తప్పుకొన్నాడు. అనంతరం ఆ అవకాశం నాగచైతన్యకు వచ్చింది. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా ‘లాల్ సింగ్ చడ్డా’ తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కబోతుంది.    

Updated Date - 2022-08-04T23:02:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!