సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tiger Shroff: ఆ హీరోయిన్‌తో బ్రేకప్ అయ్యిందని చెప్పేసిన టైగర్!.. దానికి రెడీ అంటూ..

ABN, First Publish Date - 2022-09-01T17:44:00+05:30

హిందీ టీవీ పరిశ్రమలోని పాపులర్ షోస్‌లో ‘కాఫీ విత్ కరణ్ షో(Koffee With Karan)’ ఒకటి. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ టీవీ పరిశ్రమలోని పాపులర్ షోస్‌లో ‘కాఫీ విత్ కరణ్ షో(Koffee With Karan)’ ఒకటి. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ (Karan Johar) హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకి బాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా.. కరణ్ కూడా వారిని విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతుంటాడు. ఈ షోకి తాజాగా హీరోపంటి బాలీవుడ్‌కి పరిచయమైన నటులు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff), కృతి సనన్ (Kriti Sanon) అతిథులుగా వచ్చారు.


ఈ షోలో కరణ్ అడిగిన ఎన్నో ప్రశ్నలను సమాధానాలు చెప్పింది ఈ జంట. ముఖ్యంగా టైగర్‌ని ఉద్దేశించి.. ‘నువ్వు దిశా బ్రేకప్ అయ్యారని రూమర్స్ వినిపిస్తున్నాయి. నువ్వేమంటావు’ అని కరణ్ అడిగాడు. దానికి‘అయ్యో నిజమా? చాలా కాలంగా మాపై ఊహాగానాలు ఉన్నాయి. మేం చాలా కాలంగా మంచి స్నేహితులం. ఇప్పటికీ అదే రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నాం’ అని టైగర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమాధానం కరణ్‌కి సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో.. ‘అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావా’ అని కరణ్ ప్రశ్నించాడు. దానికి.. ‘అవును.. నేను అలా అనుకుంటున్నాను. కొత్త రిలేషన్‌షిప్‌కి రెడీగా ఉన్నాను’ అని టైగర్ బదులిచ్చాడు. అలాగే.. ‘నేను ఎల్లప్పుడూ శ్రద్ధా కపూర్‌తో ప్రేమలో ఉన్నాను. ఆమె చాలా అందంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో టైగర్‌కి దిశాకి బ్రేకప్ అయ్యిందని నెటిజన్లు డిసైడ్ అయిపోయారు.

Updated Date - 2022-09-01T17:44:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!