సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈ కథ చెప్పగానే Alia Bhatt ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది: డైరెక్టర్

ABN, First Publish Date - 2022-02-16T19:26:01+05:30

ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గంగుభాయ్ కతియావాడి’ మూవీ ఒకటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గంగుభాయ్ కతియావాడి’ మూవీ ఒకటి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ భన్సాలీ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


భన్సాలీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ చెప్పగానే అలియా ఏం మాట్లాడకుండా ఉంది. తర్వాత రోజు వచ్చి ఈ మూవీని చేస్తానని చెప్పింది. నా విజన్ మీద, ఈ కథ మీద నమ్మకంతో చేయాలని నిర్ణయించుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.


అలియా గురించి భన్సాలీ మాట్లాడుతూ.. ‘ఆమె హై సోసైటీ, సిటీ, ధనవంతుల కుటుంబాని చెందిన మహిళ. ఈ సినిమాతో అప్పటి వరకూ ఉన్న ఆమె లైఫ్ స్టైల్‌కి భిన్నమైన పాత్రను చేసింది. అలాగే అలియా నిజ జీవితంలో కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. అందుకే మేం మొదట ఆమె వాయిస్‌లో బేస్ తగ్గించేందుకు ప్రయత్నించాం. ఎందుకంటే కళ్లలో పవర్ కనిపించాలంటే మాట్లాడే విధానం ప్రత్యేకంగా ఉండాలి’ అని తెలిపాడు.


నిజానికి భన్సాలీ ఈ సినిమా కంటే ముందే ‘ఇన్షాల్లా’ అనే సినిమా కోసం అలియాతో కలిసి పనిచేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది. అనంతరం ఈ మూవీ కోసమే వీరిద్దరూ కలిసి పనిచేశారు.

Updated Date - 2022-02-16T19:26:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!