అరకొర దుస్తులతో అభాసుపాలు!

ABN , First Publish Date - 2022-07-10T00:27:53+05:30 IST

సినిమా తారలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాలి. అందువల్ల కొత్త ఫ్యాషన్స్‌కు వారు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ డ్రెస్స్ సెన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. కానీ, కొత్త మంది

అరకొర దుస్తులతో అభాసుపాలు!

సినిమా తారలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాలి. అందువల్ల కొత్త ఫ్యాషన్స్‌కు వారు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ డ్రెస్ సెన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. కానీ, కొత్త మంది సెలబ్రిటీలు మాత్రం ఈ వారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోయి బోల్తాపడ్డారు. అలా అభాసుపాలైన సినీ తారలపై ఓ లుక్కేద్దామా మరి..


ఉర్ఫీ జావేద్ (Urfi Javed):

బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్ఫీ జావేద్. ఎల్లప్పుడు కొత్త రకం దుస్తులను ధరించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఉర్ఫీ ఫ్యాషన్ సెన్స్‌కు ఎంత మంది అభిమానులున్నారో అంతే స్థాయిలో నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఈ వారం నీలం రంగుతో కూడిన కట్స్ డ్రెస్‌ను ఆమె ధరించింది. ఆ డ్రెస్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. 


నోరా ఫతేహీ (Nora Fatehi):

‘మనోహరి’ పాటలో నర్తించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సొగసుల సుందరి నోరా ఫతేహీ. ఎప్పుడు కొత్త రకం దుస్తులను ధరించి తన మార్కు స్టైల్‌ను చూపిస్తుంటుంది. కానీ, ఈ వారం నోరా నీలం రంగు డ్రెస్‌ ధరించి అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఆ దుస్తులు ఆమెకు అంతగా నప్పలేదు. 


ఆమిర్ ఖాన్ (Aamir Khan):

మూడేళ్లకు ఓ సినిమా చేసిన బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టే నటుడు ఆమిర్ ఖాన్. తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ లో నటించాడు. ఈ  సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. అందువల్ల ఆమిర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ వారం అతడు ఆహుతులను ఆకట్టుకోలేకపోయాడు. నలుపు రంగు టీ-షర్ట్‌పై, వదులుగా ఉన్న ట్రాక్ ప్యాంట్స్ ధరించాడు. ఆ దుస్తులు చూసేవారిని ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. 


మలైకా అరోరా (Malaika Arora):

‘గబ్బర్ సింగ్’ లో ‘కెవ్వు కేక’ పాటలో నర్తించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన భామ మలైకా అరోరా. నటి, జడ్జిగా పలు పాత్రలు నిర్వహిస్తుంటుంది. ఈ వారంలో పూర్తిగా తెలుపు రంగు దుస్తులతో మలైక దర్శనమిచ్చింది. ఆ దుస్తులతో అభిమానులను ఫిదా చేయలేకపోయింది. 


అర్జున్ కపూర్ (Arjun Kapoor):

మలైక మాదిరిగానే ఆమె బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా తన డ్రెస్ సెన్స్‌తో చూపరులను ఆకట్టుకోలేక పోయాడు. అర్జున్ తాజాగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’ (Ek Villain Returns)లో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా అతడు పూర్తిగా నలుపు రంగు దుస్తులతో కనిపించాడు. ఈ దుస్తులు అర్జున్‌కు ఏ మాత్రం నప్పలేదు.

Updated Date - 2022-07-10T00:27:53+05:30 IST

Read more