పవన్ పాత్రలో John Abraham... రానా పాత్రలో Abhishek Bachchan

ABN , First Publish Date - 2022-05-08T02:10:19+05:30 IST

2020లో మలయాళ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ‘అయ్యప్పనుమ్ కోశియమ్’. అదే సినిమాని తెలుగులో ‘బీమ్లానాయక్’గా తెరకెక్కించారు. ఇక్కడా పాజిటివ్ రిజల్టే స్వంతం చేసుకుంది పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్. అయితే, కొన్ని రోజులుగా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమాని బాలీవుడ్ బాట పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి...

పవన్ పాత్రలో John Abraham... రానా పాత్రలో Abhishek Bachchan

2020లో మలయాళ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ‘అయ్యప్పనుమ్ కోశియమ్’. అదే సినిమాని తెలుగులో ‘బీమ్లానాయక్’గా తెరకెక్కించారు. ఇక్కడా పాజిటివ్ రిజల్టే స్వంతం చేసుకుంది పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్. అయితే, కొన్ని రోజులుగా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమాని బాలీవుడ్ బాట పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాన్ అబ్రహం ఒక హీరోగా నటిస్తుండగా మరో హీరో క్యారెక్టర్ ఎవరు చేస్తారనే దానిపై రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. ‘మిషన్ మంగళ్’ సినిమా రూపొందించిన దర్శకుడు జగన్ శక్తి ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ హిందీ వర్షన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. జాన్ అబ్రహాంతో పాటూ మొదట అర్జున్ కపూర్ ని అనుకున్నారు. కానీ, డేట్స్ ఇష్యూతో ఇప్పుడు అర్జున్ సినిమా నుంచీ తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. 


జాన్ అబ్రహాం నిర్మించి, నటిస్తోన్న మల్టీ స్టారర్ రీమేక్ నుంచీ అర్జు్న్ కపూర్ తాజాగా తప్పుకోవటంతో మేకర్స్ అభిషేక్ బచ్చన్ వద్దకి ఆఫర్ తో వెళ్లారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... అర్జున్ కపూర్ కంటే ముందు తమ సినిమాలో చేయమని అభీనే అడిగారు గతంలో. అప్పుడు జూనియర్ బి ‘నో’ చెప్పాడు. తరువాత అర్జున్ పేరు తెర మీదకు వచ్చింది. కానీ, మళ్లీ ఇప్పుడు దర్శకనిర్మాతలు అభిషేక్ బచ్చన్ వద్దకే మరోసారి వెళ్లారట. ఆయన కూడా ఆసక్తిగానే ఉన్నాడని సమాచారం. చర్చలు చురుగ్గా సాగుతున్నాయట. అభిషేక్ బచ్చన్ ఒక్కసారి పేపర్స్ పై సంతకం చేస్తే అధికారిక ప్రకటన రావచ్చని చెబుతున్నారు... 


అంతా అనుకున్నట్టు జరిగితే ఇప్పటికే తెలుగులో ‘బీమ్లానాయక్’గా విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ హిందీలోనూ జనాన్ని అలరించవచ్చు. అయితే, ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పోషించిన పోలీస్ పాత్రని జాన్ అబ్రహాం చేయనున్నాడట. అతడ్ని ఢీకొనే ఆర్మీ మ్యాన్ గా అభిషేక్ చేయాల్సి ఉంటుంది. అంటే... జూనియర్ బచ్చన్ మన రానా చేసిన క్యారెక్టర్ లో అలరిస్తాడన్నమాట! చూడాలి మరి, మలయాళ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మెనన్, తెలుగు హీరోలు పవన్ కళ్యాణ్, రానా.... వీరి కంటే జాన్, అభిషేక్ ఎక్కువ మార్కులు కొట్టేస్తారో లేదో... 


‘అయ్యప్పనుమ్ కోశియమ్’ హిందీ రీమేక్ తో పాటూ జాన్ అబ్రహాం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలోనూ కనిపించబోతున్నాడు. మరోవైపు, అభిషేక్ బచ్చన్ ఆర్. బాల్కీ దర్శకత్వంలో ‘గూమర్’ సినిమాలో నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. 

Updated Date - 2022-05-08T02:10:19+05:30 IST

Read more