Mahesh Babu రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-05-12T02:02:30+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్’ (Major) సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది

Mahesh Babu రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదీ..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్’ (Major) సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించారు. ఆ ఇండస్ట్రీ తనను భరించలేదని... అందుకే తాను అక్కడికి వెళ్లి సమాయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా మహేశ్ బాబుకు బాలీవుడ్ నుంచి అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ ఆఫర్లను ఆయన తిరస్కరిస్తున్నారు. అలా కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా వదులుకున్నారు. అలా రిజెక్ట్ చేసిన మూవీల లిస్ట్‌పై ఓ లుక్కేద్దామా..


గజిని: 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురుగదాస్ (AR Murugadoss), మహేశ్ బాబు (Mahesh Babu) కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు. నిజం చెప్పాలంటే ‘గజిని’ (Ghajini) స్క్రిఫ్ట్‌ను ముందుగా మహేశ్‌కే వినిపించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. అనంతరం సూర్యకు ఈ కథను చెప్పగా ఆయన నటించేందుకు అంగీకరించారు. ‘గజిని’ సినిమా సూర్య కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. తర్వాత మహేశ్ బాబు, మురుగదాస్ కలసి ‘స్పైడర్’ చేశారు. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 


యానిమల్: 

‘అర్జున్ రెడ్డి’  (Arjun Reddy) సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఈ చిత్రం మహేశ్ బాబుకు ఎంతగానో నచ్చింది. దీంతో సందీప్‌కు మహేశ్ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు సందీప్ ‘యానిమల్’ (Animal) కథను సూపర్ స్టార్‌కు వినిపించారు. ఈ చిత్రం చేసేందుకు మహేశ్ అంగీకరించలేదు. తర్వాత ఈ ప్రాజెక్టులోకి రణ్‌బీర్ కపూర్ వచ్చారు. ప్రస్తుతం ‘యానిమల్’ మూవీ చిత్రీకరణ జరుపుకొంటుంది. 


కరణ్ జోహార్‌ ప్రాజెక్టు:  

సౌత్ హీరోలను బాలీవుడ్‌కు పరిచయం చేసే దర్శకుడు, నిర్మాత  కరణ్ జోహార్ (Karan Johar). విజయ్ దేవరకొండ‌ (Vijay Devarakonda)ను బీ టౌన్‌కు ఇంట్రడ్యూస్ చేస్తోంది కరణ్ జోహారే. మహేశ్ బాబుతో కరణ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. ఓ దర్శకుడితో కథను కూడా చెప్పించారు. కానీ, సూపర్ స్టార్ ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించలేదు. ఇక మహేశ్ బాబు కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆయన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాలో నటించాడు. ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. 


Updated Date - 2022-05-12T02:02:30+05:30 IST