Bigg Boss: అది దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇకపై బిగ్‌బాస్ చూడనంటున్న బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-10-14T17:59:29+05:30 IST

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ (Bigg Boss) కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. మొదట హిందీలో ప్రారంభమై అనంతరం ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ప్రారంభమైంది..

Bigg Boss: అది దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇకపై బిగ్‌బాస్ చూడనంటున్న బాలీవుడ్ బ్యూటీ

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ (Bigg Boss) కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. మొదట హిందీలో ప్రారంభమై అనంతరం ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ప్రారంభమైంది. హిందీలో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 16 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా చేస్తున్న ఈ షో కంటెస్టెంట్స్ ఎవరు అంటూ ప్రారంభానికి ముందు పెద్ద చర్చే నడిచింది. అయితే.. అందులో లైగింక వెధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) కూడా ఉన్నాడు. అది నెటిజన్లతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలకి కోపానికి కారణమైంది.  

దాంతో.. చాలామంది నటీమణులు, సినీ టెక్నిషియన్స్ సాజిద్‌కి అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌ యాజమాన్యంపై.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తే.. లైగింక వేధింపులు చేయడం తమ హక్కు అని చాలా మంది పురుషులు భావిస్తారని కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సాజిద్‌పై విమర్శలు చేయగా.. తాజాగా మరో నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా స్పందించారు.


తనుశ్రీ దత్తా 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య. ప్రజలపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. నేను బిగ్ బాస్ చూడను. ఇప్పుడే కాదు ఇకపై ఎప్పుడు చూడను


మీటూ అనేది భారతదేశంలో వచ్చిన గొప్ప విప్లవం. ఇప్పటి వరకూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్న చాలా మంది దాని గురించి బయటికి మాట్లాడే వారు కాదు. ఆధునిక భారతీయ అమెరికన్ అమ్మాయిగా.. ఈ రకమైన మౌనాన్ని ఎవరైనా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం నా వల్ల కావట్లేదు. వెధవ పనులు చేసేవారికి శిక్షలు పడితేనే వ్యవస్థ, సమాజం సురక్షితంగా ఉంటుంది. అదొక లాజిక్. మీ వెంటపడి ఇబ్బంది పెట్టేవారి గురించి మాట్లాడకుండా ఎందుకు మౌనం ఉంటున్నారు. వారిపై పోలీసులకి కంప్లైంట్ చేయండి. 

చాలా మంది నేను అమెరికన్‌గా మారిపోయానని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను భారతీయ మహిళగా నా గౌరవాన్ని నిలబెట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-10-14T17:59:29+05:30 IST