Taimur's Pre-Birthday Celebrations: స్టార్ వార్‌ థీమ్‌తో.. స్టార్ కిడ్ బర్త్ డే పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2022-12-16T11:46:51+05:30 IST

బాలీవుడ్ నటులు కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మొదటి కుమారుడు తైమూర్ అలీ ఖాన్ (Taimur Ali Khan) త్వరలో 6వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

Taimur's Pre-Birthday Celebrations: స్టార్ వార్‌ థీమ్‌తో.. స్టార్ కిడ్ బర్త్ డే పిక్స్ వైరల్

బాలీవుడ్ నటులు కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మొదటి కుమారుడు తైమూర్ అలీ ఖాన్ (Taimur Ali Khan) త్వరలో 6వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. అతను డిసెంబర్ 20న పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. దానికి కొన్ని రోజుల ముందే పుట్టిన రోజు వేడుకలని కరీనా, సైఫ్ నిర్వహించారు. దానికి కోసం ప్రత్యేకంగా ఓ థీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు.

తైమూర్‌కి స్టార్ వార్స్ అంటే చాలా ఇష్టం. దాన్నే అతని ప్రీ బర్త్‌డే వేడుకలకి థీమ్‌గా తీసుకున్నారు. ఎంట్రీ గేట్ దగ్గర నుంచి కేక్ వరకూ అన్నింటిని స్టార్ వార్స్ స్టైల్‌లోనే వారు రూపొందించారు. ఈ పార్టీని త్రీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్వహించింది. దీనికి సంబంధించిన పలు పిక్స్‌ని కరీనా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌పై మీరు ఓ లుక్కేయండి.

taimur-1.jpg

taimur.jpg

Updated Date - 2022-12-16T14:24:49+05:30 IST