సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood: అయ్యయ్యో.. కనీసం కోటి రూపాయలు కూడా రాలేదేంటి..? ఆ బాలీవుడ్ సినిమా కలెక్షన్లలో షాకింగ్ పరిణామం..!

ABN, First Publish Date - 2022-08-21T00:50:45+05:30

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామా తాప్సీ పన్ను (Taapsee Pannu). హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ పన్ను (Taapsee Pannu). హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘పింక్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాలతో అభిమానులను మెప్పించింది. తాజాగా ‘దోబారా’ (Dobaaraa) లో నటించింది. అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలైంది. ఈ మధ్య విడుదలవుతున్న అన్ని హిందీ చిత్రాల మాదిరిగానే ‘దోబారా’ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు కనీసం కోటి రూపాయల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ.75లక్షల కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది.


‘దోబారా’ ను రూ. 50కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం అందులో సగం కూడా వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందింది. తాప్సీకీ ఇది వరసగా ఐదో పరాజయం. గతంలో ఆమె నటించిన ‘రష్మీ రాకెట్’ (Rashmi Rocket), ‘లూప్ లపేటా’ ( Loop Lapeta), శభాష్ మిథూ (Shabaash Mithu) దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజ్ కుమార్ హీరాణీ తెరకెక్కిస్తున్న ‘డంకీ’ లో నటిస్తుంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ‘వో లఢకీ హై కహా’, ‘బ్లర్’ వంటి ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.  

Updated Date - 2022-08-21T00:50:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!