సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘శభాష్ మిథు’ ట్రైలర్ విడుదల.. క్రికెటర్‌గా సిక్స్ కొట్టిన Taapsee Pannu..

ABN, First Publish Date - 2022-06-20T21:10:41+05:30

బాలీవుడ్ తెరపై ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ కొత్తేం కాదు. గతంలో ఎమ్‌ఏస్.ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా క్రికెట్‌కు సంబంధించి మరో బయోపిక్ బాక్సాఫీస్ వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ తెరపై ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ కొత్తేం కాదు. గతంలో ఎమ్‌ఏస్.ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా క్రికెట్‌కు సంబంధించి మరో బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కొచ్చేస్తోంది. ఈసారి ఇండియన్ ఉమెన్ క్రికెట్‌ టీమ్‌కు చెందిన లివింగ్ లెజెండ్ మిథాలీ రాజ్ (Mithali Raj) సక్సెస్ స్టోరీని జనం చూడబోతున్నారు. 


మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిథు’ (Shabaash Mithu)పేరుతో తెరకెక్కింది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను (Taapsee Pannu) హీరోయిన్‌గా నటించారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. వయకాం 18స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను జూన్ 20న తాప్సీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘‘మిథాలీ రాజ్ పేరు మీకు తెలుసు. ఆమె లెజెండ్‌గా మారడానికి వెనకున్న కథను చూడటానికి మీరు సిద్ధంగా ఉండండి. ఓ మహిళ జెంటిల్ మేన్ గేమ్‌ను పునర్ నిర్వచించారు. ఆమె చరిత్రను సృష్టించారు. మిథాలీ కథను మీ ముందుకు తీసుకువస్తున్నందకు నేను గర్వపడుతున్నాను’’ అని తాప్సీ పేర్కొన్నారు. మిథాలీ రాజ్ కూడా ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఒక ఆట, ఒక దేశం, ఒక ఆశయం.. నా కల. నా కథను మీ అందరికి చెప్పడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్ర బృందానికి రుణపడి ఉంటాను’’ అని మిథాలీ రాజ్ ట్విట్టర్‌లో చెప్పారు. ఈ సినిమా కోసం తాప్సీ ఎంతగానో చెమటోడ్చొచారు. క్రికెట్ ట్రైనింగ్ తీసకున్నారు. క్రికెట్‌ను రియల్‌గా చూపించడానికి మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేడియాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. చివరగా తాప్సీ ‘లూప్ ల పేట’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ‘డంకీ’, ‘దుబారా’, ‘బ్లర్’ సినిమాల్లో నటిస్తున్నారు. 



Updated Date - 2022-06-20T21:10:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!