సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Viral Video: నీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చిన Sunny Leone.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-06-09T19:11:17+05:30

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. జిస్మ్‌తో బాలీవుడ్‌లోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. జిస్మ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలోనే ఓ ఇల్లు కొని భర్త డేనియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.


అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు. అవాక్కయిన సన్నీ.. పూల్‌లో నుంచే అతడిపైకి చెప్పు విసిరింది. ఆ వీడియోను షేర్ చేసిన సన్నీ..‘పగ తీర్చుకోబోతున్నా.. సన్నీ రజనీ త్వరలోనే నీపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-06-09T19:11:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!