Viral Video: నీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చిన Sunny Leone.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-06-09T19:11:17+05:30 IST
పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. జిస్మ్‌తో బాలీవుడ్‌లోకి...

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. జిస్మ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలోనే ఓ ఇల్లు కొని భర్త డేనియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు. అవాక్కయిన సన్నీ.. పూల్‌లో నుంచే అతడిపైకి చెప్పు విసిరింది. ఆ వీడియోను షేర్ చేసిన సన్నీ..‘పగ తీర్చుకోబోతున్నా.. సన్నీ రజనీ త్వరలోనే నీపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు.