సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sunny Leone: వాళ్లుంటే కుదరదు.. ఐటమ్ సాంగ్స్ చేయడానికి షరతులు పెడుతున్న సన్నీ

ABN, First Publish Date - 2022-11-09T16:49:25+05:30

పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన బ్యూటీ సన్నీ లియోన్ (Sunny Leone). బాలీవుడ్‌ (Bollywood)లో వరుస సినిమాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన బ్యూటీ సన్నీ లియోన్ (Sunny Leone). బాలీవుడ్‌ (Bollywood)లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నా ఈ భామ అప్పుడప్పుడు దక్షిణాది భాషల్లోనూ నటిస్తోంది. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులని పలకరిస్తోంది. ఈ తరుణంలో ఈ బ్యూటీ తమిళంలో నటించి తాజా చిత్రం ‘ఓ మై ఘోస్ట్‌’ (ఓఎంజీ). ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. కెరీర్ పరంగా పిక్స్‌లో ఉన్న సన్నీ లియోన్‌ ఐటమ్స్‌ సాంగ్స్‌ (Item Songs) చేసేందుకు పలు షరతులు విధిస్తోందని తెలుస్తోంది. వాటికి అంగీకరించిన దర్శక నిర్మాతలకే ఆమె డేట్స్‌ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా దర్శకుడు టీఎం జయమురుగన్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ కోసం చిత్రబృందం సన్నీ లియోన్‌ని సంప్రదించిందట.


ప్రత్యేక గీతంలో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపిన సన్నీ.. తన షరతులకు అంగీకరిస్తేనే డేట్స్‌ ఇస్తానని ఈ తార ఖరాఖండిగా తేల్చి చెప్పిందట. అందులో ముఖ్యంగా ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో చిన్న పిల్లలు ఉండకూడదనీ, తనతో కలిసి డ్యాన్స్ చేసే ఇతర డ్యాన్సర్లకు కూడా తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని, షూటింగ్‌ లొకేషన్‌లో కరోనా నిబంధనలు పాటించాలని, ఇలా అనేక షరతులు చెప్పుకొచ్చిందట. కాగా.. వాటన్నింటికి దర్శకుడు ఓకే చెప్పి ఆమె డేట్స్‌ తీసుకున్నారని సమాచారం. కాగా, ఈయన తెరకెక్కించే చిత్రానికి ‘తీ ఇవన్‌’ అనే పేరు ఖరారు చేయగా, ఇందులో కార్తీక్‌, సుకన్య, రాధారవి, సుమన్‌ తదితరులు నటిస్తున్నారు.


కాగా.. సన్నీ తాజాగా నటించిన చిత్రం ‘జిన్నా’ ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. కాగా.. సన్నీ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి.





Updated Date - 2022-11-09T16:49:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!