సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొడుకు పెళ్లికొడుకైన వేళ... తండ్రి పెళ్లి ముచ్చట్లు చెప్పిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్!

ABN, First Publish Date - 2022-04-14T18:51:40+05:30

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరి నోట విన్నా రణబీర్ కపూర్ పెళ్లి ముచ్చట్లే! అయితే, రణబీర్‌ కపూర్‌ని షార్ట్‌గా... ఆర్కే అని కూడా అంటుంటారు. కానీ, 2022లో జరుగుతోన్న ఈ తరం ఆర్కే పెళ్లి కంటే ముందే 1980లో మరో ఆర్కే పెళ్లి జరిగింది ముంబైలో! ఆ నిన్నటి తరం ఆర్కేనే... రణబీర్ తండ్రి... రిషీ కపూర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరి నోట విన్నా రణబీర్ కపూర్ పెళ్లి ముచ్చట్లే! అయితే, రణబీర్‌ కపూర్‌ని షార్ట్‌గా... ఆర్కే అని కూడా అంటుంటారు. కానీ, 2022లో జరుగుతోన్న ఈ తరం ఆర్కే పెళ్లి కంటే ముందే 1980లో మరో ఆర్కే పెళ్లి జరిగింది ముంబైలో! ఆ నిన్నటి తరం ఆర్కేనే... రణబీర్ తండ్రి... రిషీ కపూర్...


నాలుగు దశాబ్దాల కిందట లెజెండ్రీ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కపూర్ ఇంట భజంత్రీలు మోగాయి. రిషీ కపూర్ తాళి కట్టాడు. నీతూ సింగ్ కాస్తా నీతూ కపూర్ అయిపోయింది. ఆమే ఈనాటి పెళ్లికొడుకు రణబీర్ కపూర్ తల్లి! అయితే, రిషీ-నీతూ పెళ్లిలో ఓ పెద్దాయన డోలక్ వాయించి అందరి చేతా స్టెప్పులు వేయించాడు. ఆయనే... బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్! 


రణబీర్, ఆలియా పెళ్లి సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుభాస్ ఘాయ్ 1980 నాటి ముచ్చట్లు జనంతో పంచుకున్నాడు. రిషీ కపూర్ పెళ్లిలో తాను ఉత్సాహంగా డోలక్ వాయించానని చెప్పిన ఆయన రాజ్ కపూర్ సినీ పరిశ్రమలోని వారందర్నీ ఒకే కుటుంబంలా భావించే వారని చెప్పుకొచ్చాడు. అంతే కాదు, అప్పుడు... ఇప్పుడు కూడా ‘కపూర్స్’ ఎంతో అప్యాయత కలిగిన వారని మెచ్చుకున్నాడు. ‘కపూర్ ఖాన్‌దాన్’ పెళ్లిళ్లలో ఆహారం, పానీయాలు, సంగీతం అదిరిపోతాయంటూ కితాబునిచ్చాడు! 

Updated Date - 2022-04-14T18:51:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!