Raju Srivastav: ఆస్పత్రి పాలైన స్టార్ కమెడియన్.. ఐసీయూలోకి వెళ్లి మరీ సెల్ఫీలు దిగిన ఆగంతకుడు..!

ABN , First Publish Date - 2022-08-23T00:46:55+05:30 IST

ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ్ (Raju Srivastav) జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు గుండెపోటుగా నిర్ధారించి

Raju Srivastav: ఆస్పత్రి పాలైన స్టార్ కమెడియన్.. ఐసీయూలోకి వెళ్లి మరీ సెల్ఫీలు దిగిన ఆగంతకుడు..!

ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ్ (Raju Srivastav) జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు గుండెపోటుగా నిర్ధారించి అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికీ తరలించారు. ప్రస్తుతం రాజు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అతడికీ మెరుగైన చికిత్సను అందించేందుకు కోల్‌కత్తా నుంచి న్యూరాలజిస్టుని రప్పించినట్టుగా డాక్టర్స్ తాజాగా తెలిపారు.   


స్టార్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ్ ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి అందరి కళ్లు కప్పి ఆ విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం రాజుతో సెల్ఫీలు దిగాడు. ఈ విషయంపై రాజు కుటుంబసభ్యులు ఆస్పత్రి యజమాన్యానికీ ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఆ విభాగం బయట భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అనుమతి లేకుండా ఎవరిని కూడా ఆ విభాగంలోకి అనుమతించడం లేదు. ఆ ఆగంతకుడిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 


Updated Date - 2022-08-23T00:46:55+05:30 IST