Sonakshi Sinhaకి నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు.. అసలు నిజమేంటో చెప్పేసిన అందాల భామ..
ABN , First Publish Date - 2022-05-12T18:16:31+05:30 IST
బాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా (shatrughan sinha) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ గుర్తింపు పొందిన నటి సోనాక్షి సిన్హాబాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా (shatrughan sinha) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ గుర్తింపు పొందిన నటి సోనాక్షి సిన్హా...

బాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా (shatrughan sinha) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ గుర్తింపు పొందిన నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). ఈ బ్యూటీ వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఈ బ్యూటీ గత కొన్నిరోజుల క్రితం తన జీవితంలో బిగ్ డే అంటూ ఓ వెలికి రింగ్‌తో ఓ వ్యక్తి చేయిపట్టుకున్న పిక్‌ని షేర్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి నిశ్చితార్థం జరిగిందంటూ నెట్టింట విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ పిక్స్ వెనకున్న అసలు నిజాన్ని సోనాక్షి తాజా ఓ పోస్ట్ ద్వారా రివీల్ చేసింది.
సోనాక్షి తాజాగా చేసిన ఆ పోస్ట్‌లో.. ‘సరే సరే.. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నాను. అందులో బోలెడన్ని హింట్స్ ఇచ్చాను. అందులో ఒక్క అబద్ధం కూడా లేదు. నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీ (SOEZI)ని ప్రారంభించే రోజు నిజంగా నాకు గొప్ప రోజే. అద్భుతమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి స్టాప్. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఒకదానికి నిజం చేసుకోబోతున్నాను. ఆ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. సోయిజీ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా కొత్త ప్రేమని మీతో పంచుకుంటున్నాను. మీరు ఏమనుకున్నారు??? హహహహ.. లవ్ యూ గాయ్స్! మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. దీంతో సోనాక్షికి నిశ్చితార్థం అయ్యిందనే పుకార్లకి ఈ పోస్ట్ ద్వారా చెక్ పడింది.
Read more