సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood నటులు హిందీ మాట్లాడలేకపోవడం సిగ్గుచేటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన Popular Singer

ABN, First Publish Date - 2022-06-30T18:51:07+05:30

బాలీవుడ్‌లోని పాపులర్ సింగర్స్‌లో సోనా మహపాత్ర (Sona Mohapatra) ఒకరు. ‘సోనా’ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని పాపులర్ సింగర్స్‌లో సోనా మహపాత్ర (Sona Mohapatra) ఒకరు. ‘సోనా’ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ (Bollywood) స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు సాధించింది. అంతేకాకుండా.. ఈ గాయని తన అభిప్రాయాలను సైతం ముక్కుసూటిగా చెబుతూ ఉంటుంది. అలాగే.. బాలీవుడ్‌లో స్త్రీల హక్కుల గురించి కూడా తరచు మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఓ ఇంటర్వ్యూలో సోనా మాట్లాడుతూ.. ‘నేను ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప (Pushpa) సినిమాలను చూశాను. వాటిని చూస్తూ దాదపు ఎగిరిగంతేసినంత పని చేశాను. నా గోలతో జనాలను ఇబ్బంది పెట్టినంత పని చేశానని మాత్రం చెప్పగలను. సినిమాలో మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్‌, కళా దర్శకత్వం, నటీనటుల ఎంపిక అద్భుతంగా ఉన్నాయి. వారు తమ సంస్కృతిని చూపించడం గొప్పగా అనిపించింది. మనకు హిందీలో గొప్ప నటీనటులు ఉన్నారు. అయితే.. వారిలో కొద్దిమంది మాత్రమే స్పష్టమైన హిందీని మాట్లాడగలరు. ఓ బాలీవుడ్ యాక్టర్‌గా వారు హిందీ (Hindi) మాట్లాడలేకపోవడం సిగ్గు చేటు. ఓ బాలీవుడ్ యాక్టర్‌గా హిందీని అనర్గళంగా మాట్లాడడం చాలా ముఖ్యం. సౌత్ సినీ పరిశ్రమల్లోని సినిమాల్లో భారతీయని చాలా గొప్పగా చూపిస్తారు’ అని చెప్పుకొచ్చింది. 


హిందీలో తెలుగు (Telugu), కన్నడ (Kannada) సినిమాల డబ్బింగ్ వర్షన్స్ సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాల అన్ని రికార్డులనీ ఈ రెండు చిత్రాలు తుడిచి పెట్టేశాయి. దీంతో హిందీ వర్సెస్ సౌత్ చర్చ మొదలైంది. ఈ తరుణంలోనే కన్నడ స్టార్ హీరో సుదీప్.. ‘ఇకపై హిందీ జాతీయ భాషకాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ చర్చ ఇంకా ముదిరింది. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య రాజీ కుదిరినప్పటికీ.. సాధారణ జనాల్లో చర్చ అయిపోలేదు. ఈ తరుణంలో గాయని సోనా మహాపాత్ర చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Updated Date - 2022-06-30T18:51:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!