సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాకిస్తానీలు నన్ను చంపేస్తామంటున్నారు : salman khan మాజీ గాళ్ ఫ్రెండ్

ABN, First Publish Date - 2022-01-04T00:14:50+05:30

పాకిస్థాన్‌లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. మధ్యలో ఇండియాకొచ్చిన సల్మాన్ ఎక్స్‌గాళ్‌ఫ్రెండ్ బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంది. కానీ, అనూహ్యంగా బాయ్‌ఫ్రెండ్‌ని, బాలీవుడ్‌ని ముంబైలోనే వదిలేసి అమెరికాకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడ ఆమె ప్రస్తుతం చేస్తోన్న పని గురించి వింటే ఎవరైనా ఒకింత ఆశ్చర్యపోతారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్థాన్‌లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. మధ్యలో ఇండియాకొచ్చిన సల్మాన్ ఎక్స్‌గాళ్‌ఫ్రెండ్ బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంది. కానీ, అనూహ్యంగా బాయ్‌ఫ్రెండ్‌ని, బాలీవుడ్‌ని ముంబైలోనే వదిలేసి అమెరికాకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడ ఆమె ప్రస్తుతం చేస్తోన్న పని గురించి వింటే ఎవరైనా ఒకింత ఆశ్చర్యపోతారు. ఈ మాజీ సినీ హీరోయిన్ ఓ ఎన్‌జీవో స్థాపించి హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురయ్యే బాధితుల్ని ఎన్నో వ్యయప్రయాసలు, ప్రమాదాలకు ఓర్చి కాపాడుతుంటుంది! 


స్క్రీన్ మీద కాదు... రియల్ లైఫ్‌లోనూ బ్రేవ్ లేడీ అయిన బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ సోమీ అలీ తనకు ఎదురయ్యే హెచ్చరికలు, గండాల గురించి మాట్లాడింది. ఆమె మాతృదేశం పాకిస్థాన్. కానీ, ఆ దేశం నుంచే చాలా మంది మగవాళ్లు ఆమెను చంపేస్తామని బెదిరిస్తుంటారట! ‘‘నువ్వు ఎప్పుడు పాకిస్థాన్ వచ్చినా నీ సంగతి తేల్చేస్తాం’’ అంటూ ఈమెయిల్స్ పంపుతారని చెబుతోంది సోమీ అలీ.


తన ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది ఈ మాజీ బాలీవుడ్ హీరోయిన్. ముఖ్యంగా, గే విక్టిమ్స్‌కి సోమీ అలీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమట. ఆమె ఎన్నో సంవత్సరాలుగా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. అక్కడికి వెళితే తనకు ప్రాణ గండం తప్పదంటోంది సోమీ. 


1989లో సల్మాన్ ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి అమెరికా నుంచీ ముంబైకి వచ్చేసింది 16 ఏళ్ల సోమీ అలీ. అనుకున్నట్టే ఆనాటి యంగ్ అండ్ హ్యాండ్సమ్ సల్మాన్ మనసు దోచుకోగలిగింది. పదేళ్ల పాటూ వారి మధ్య రిలేషన్ కొనసాగింది. కానీ, తరువాత అనేక వ్యక్తిగత కారణాల వల్ల సోమీ సల్మాన్‌తో ఉండలేకపోయింది. అతడ్నుంచీ బ్రేకప్ అయ్యాక అమెరికా వెళ్లిపోయింది. దశాబ్దం పాటూ ఇండియాలో ఉన్న ఆమె ఇప్పుడు తనకు భారతదేశమే ఎక్కువ ఇష్టం అంటోంది. పాకిస్థాన్ ఆ తరువాతే అని చెబుతోంది. సోమీ అలీ సల్మాన్ తరువాత ఇంత వరకూ మరెవ్వరితోనూ డేటింగ్ చేయలేదు. సింగిల్‌గానే ఉండిపోయింది. సమాజ సేవలోనే జీవితం గడుపుతోంది...    

Updated Date - 2022-01-04T00:14:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!