సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Singer: కాస్టూమ్ స్టైలిస్టుపై ప్రముఖ గాయకుడి అత్యాచారం

ABN, First Publish Date - 2022-08-16T14:10:04+05:30

ప్రముఖ గాయకుడిపై అత్యాచారం కేసు నమోదవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి(మహారాష్ట్ర): ప్రముఖ గాయకుడిపై అత్యాచారం కేసు నమోదవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. బాలీవుడ్ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ ముంబయి నగరంలోని తన ఫ్లాట్ లో 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారం చేశాడని ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.గాయకుడు రాహుల్ జైన్ తనను ఇన్ స్టాగ్రామ్ వేదికగా తాను చేస్తున్న పనిని మెచ్చుకొని, ఒకసారి తన ఫ్లాటుకు రమ్మని ఆహ్వానించాడని బాధిత కాస్ట్యూమ్ స్టయిలిస్టు ఒషివర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా నియమించుకుంటానని చెప్పి అంధేరీలోని అతని ఫ్లాటుకు పిలిపించి తనను బెడ్రూంలోకి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 బాధిత మహిళ ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా పనిచేస్తుందని ముంబయి పోలీసులు చెప్పారు. తాను ప్రతిఘటించినా తనపై గాయకుడు రాహుల్ జైన్ బలవంతంగా అత్యాచారం చేసి, సాక్ష్యాలను తొలగించాడని బాధిత మహిళ ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదులో రాహుల్ జైన్ పై పోలీసులు ఐపీసీ సెక్సన్ 376.323,506 ల కింద కేసు నమోదు చేశారు. కాగా తనకు ఆ మహిళ తెలియదని, గతంలోనూ మరో మహిళ కూడా తనపై అత్యాచారం కేసు పెట్టిందని రాహుల్ చెప్పారు.గత ఏడాది అక్టోబరు నెలలో ఓ మహిళ తనపై రాహుల్ జైన్ అత్యాచారం చేసి గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.  

Updated Date - 2022-08-16T14:10:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!