Neha Bhasin: బాలీవుడ్ సింగర్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..

ABN , First Publish Date - 2022-11-28T20:31:55+05:30 IST

హిందీ బిగ్ బాస్ ఓటీటీ (Bigg Boss OTT)తో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ గాయని నేహా భాసిన్..

Neha Bhasin: బాలీవుడ్ సింగర్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..

హిందీ బిగ్ బాస్ ఓటీటీ (Bigg Boss OTT)తో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ గాయని నేహా భాసిన్ (Neha Bhasin). ఈ భామ తన స్ట్రెయిట్ ఫార్వార్డ్ ప్రవర్తనతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఈ గాయని (Singer) పుట్టిన రోజుని జరుపుకుంది. అనంతరం గాయని తన పుట్టినరోజు పార్టీ తర్వాత బికినీలో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె బికినీలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోని చూసిన చాలామంది గాయనిపై విమర్శలు చేస్తున్నారు.


వాటిలో.. ‘చేయడానికి వేరే పని లేదా. ఇది మాత్రమే ఉందా’ అని ఒకరు.. ‘మహిళలకు తమకు కావలసిన వాటిని ధరించే హక్కు ఉంది. కానీ అదే సమయంలో గౌరవంగా ఉండాలని కూడా గుర్తుంచుకోండి’ అని ఇంకొకరు.. ‘బిగ్‌బాస్ నుంచి పంపించిన తర్వాత ఇలా ప్రవర్తిస్తోంది’ అని మరొకరు.. ‘నీ పాటతో అందరినీ కట్టిపడేసే నీకు ఇలాంటివి చేయాల్సిన పని లేదు’ అని రాసుకొచ్చారు. కాగా.. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమాలో జగ్ గోమేయా సాంగ్‌కి బెస్ట్ ప్లే బ్యాక్ గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా పితృస్వామ్యం మీద కామెంట్స్ చేస్తుంటుంది.





Updated Date - 2022-11-28T20:31:55+05:30 IST

Read more