రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అని Kanika Kapoor చెప్పగానే ఆమె పిల్లల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-29T16:18:46+05:30 IST

బేబీ డాల్, జుగ్నీ జీ, చిట్టియాన్ కలైయాన్, టుకుర్ టుకూర్ వంటి సాంగ్స్‌తో గుర్తింపు పొందిన సింగర్ కనికా కపూర్...

రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అని Kanika Kapoor చెప్పగానే ఆమె పిల్లల రియాక్షన్ ఏంటంటే..

బేబీ డాల్ (Baby Doll), జుగ్నీ జీ, చిట్టియాన్ కలైయాన్, టుకుర్ టుకూర్ వంటి సాంగ్స్‌తో  గుర్తింపు పొందిన సింగర్ కనికా కపూర్. 1978లో పుట్టిన ఈ బ్యూటీ 1998లో అంటే తన 20 ఏళ్ల వయస్సులో ఎన్నారై వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకి యువరాజ్, సమర, ఆయానా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. వివిధ కారణాల వల్ల 2012లో విడిపోయారు. ఇటీవలే ఈ భామ తన 44 ఏళ్ల వయస్సులో  మరో ఎన్నారై వ్యాపారవేత్త గౌతమ్ హథీరమణి(Gautam Hathiramani)ని లండన్‌లో వివాహం చేసుకుంది. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్పినప్పుడు తన ముగ్గురి పిల్లల రియాక్షన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


కనికా కపూర్ తన భర్త, గౌతమ్‌తో తన ప్రేమ కథ గురించి మాట్లాడుతూ.. ‘మేము 15 సంవత్సరాలుగా మంచి స్నేహితులం. అతను ఎప్పుడూ నాకు సపోర్టుగా ఉండేవాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకోమని గౌతమ్‌ని రెండుసార్లు అడిగాను. బేబీ డాల్ సాంగ్ విడుదల తర్వాత 2014లో మొదటిసారిగా నేను అతనిని అడిగాను. అయితే.. నేను జోక్ చేస్తున్నాను అనుకొని లైట్ తీసుకున్నాడు. అనంతరం 2020లో మళ్లీ అడిగాను. అప్పుడే నేను సీరియస్‌గా ఉన్నానని అతనికి అర్థమైంది. అలా మా ప్రేమకథ మొదలైంది’ అని చెప్పుకొచ్చింది.కనికకు మొదటి భర్త కారణంగా ప్రస్తుతం 19 ఏళ్ల కొడుకు యువరాజ్, 17, 15 ఏళ్ల కూతుర్లు ఆయానా, సమర కలిగారు. పెళ్లి గురించి చెప్పినప్పుడు వారి రియాక్షన్  గురించి మాట్లాడుతూ.. ‘గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు వాళ్లు కొంచెం బాధపడ్డారు. కానీ.. పెళ్లికి కొన్ని రోజుల ముందు నా చిన్న కూతురు వచ్చి ఆయనకి నిన్ను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంది. అది విని షాక్ అయ్యాను. వెంటనే గౌతమ్‌తో పెళ్లి తర్వాత మనందరం ఒకే కుటుంబం అవుతామని చెప్పాను. అనంతరం పెళ్లిలో మండపానికి నాతో పాటు నా కొడుకు రావడం, పేరాస్‌లో నా కూతర్లు ఇద్దరూ పాల్గొనడంతో ఎంతో ఎమోషనల్ అయ్యాను. వారి కళ్లలో నాకు ఆనందం కనిపించింది. సంగీత్‌తో నా పాటలకి డ్యాన్స్ కూడా చేశారు’ అని తెలిపింది.

Updated Date - 2022-05-29T16:18:46+05:30 IST

Read more