సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జెంటిల్‌మేన్ అంటూ బాలీవుడ్ యంగ్ హీరోపై ప్రశంసలు.. విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-03-14T19:31:43+05:30

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఒకరు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఒకరు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బీ టౌన్‌కి పరిచయమై టాలెంటెడ్ నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ యువ నటుడు తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్నాడు. అక్కడ ఆయన చేసిన ఒక పనితో ఎంతోమంది అభిమానుల ప్రశంసలు దక్కించుకున్నాడు.


తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు 2020’ కార్యక్రమంలో జరిగింది. అందులో బాలీవుడ్ చెందిన ఎంతోమంది తారలు పాల్గొన్నారు. అందులో సిద్ధార్థ్ మల్హోత్రాతోపాటు బ్యూటీఫుల్ కృతిసనన్ కూడా ఉన్నారు. ఈ భామ ఏ సినీ అవార్డుల పంక్షన్‌కైనా అందంగా, ఆకట్టుకునేలా డ్రెస్సింగ్‌తో అందరి మనసులను దోచుకుంటుంటూ ఉంటుంది. 


తాజాగా ఈ కార్యక్రమంలో సైతం అందమైన లావెండర్ గౌన్ వేసుకొని వచ్చింది. అందులో ఆమె స్టైల్‌కి ఎంతోమంది ఫిదా అయిపోయారు. అయితే ఆ గౌను చివరలో చాలా పొడవుగా ఉంది. దీంతో రిపోర్టర్ల పిక్స్‌కి ఫోజులిస్తున్న తరుణంలో అది అడ్డుపడగా కొంచెం ఇబ్బందిపడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థ్ ఆమె గౌనుని పట్టుకొని తనకి సహాయంగా నిలుచున్నాడు. దీంతో కృతి మీడియాకి వివిధ స్టైల్స్‌లో స్టిల్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో ఈ నటుల అభిమానులు సిద్ధార్థ్‌ని ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు.


అందులో ఓ నెటిజన్.. ‘ఈ జంట కలిసి సినిమాలో నటిస్తే చూడాలని ఉంది’ అంటూ.. ‘ఆయన జెంటిల్ మేన్’ అని మరొకరు.. మరో లేడి అభిమాని అయితే.. ‘సిద్ధార్థ్ వంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు’ అంటూ కామెంట్ చేసింది. అలాగే మరొకరు.. ‘ఇండియాలో క్రిస్ ఎవెన్స్’ అంటూ అవెంజర్స్ సినిమాల్లో కెప్టెన్ అమెరికాగా పాపులారిటీ సాధించిన హీరోతో పోల్చుతూ కామెంట్ చేశారు.



Updated Date - 2022-03-14T19:31:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!