సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌లో మరోసారి Drugs కలకలం.. పోలీసుల అదుపులో Shraddha Kapoor సోదరుడు

ABN, First Publish Date - 2022-06-13T16:29:24+05:30

గత కొంతకాలంగా సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ (Drugs) కలకలం రేగుతున్న విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ (Drugs) కలకలం రేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో మరి ఎక్కువగా ఉంది. కొన్నేళ్లక్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవరితోపాటు పలువురు సెలబ్రిటీలు, గతేడాది షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు నమోదయ్యాయి. తాజాగా మరో ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) సోదరుడు, సీనియర్ నటుడు శక్తి కపూర్ (Shakthi Kapoor) కుమారుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు.


నివేదికల ప్రకారం.. గత ఆదివారం (జూన్ 12) రాత్రి ఎంజీ రోడ్‌లోని ఒక హోటల్‌‌లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులకి పక్కా సమాచారం అందింది. దాడి చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కూడా ఉన్నాడు. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానంతో పలువురు శాంపుల్స్‌ని డ్రగ్ టెస్ట్‌కి పంపగా.. ఆరుగురికి ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. అందులో సిద్ధాంత్ కూడా ఉన్నాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా లేక హోటల్‌కు రాకముందే డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయంపై పోలీసులకు ఇంకా క్లారిటీ రాలేదు. కాగా.. సిద్ధాంత్ కపూర్ భాగమ్ భాగ్, చుప్ చుప్ కే, భూల్ భూలయ్యా వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అలాగే.. జజ్బా, హసీనా పార్కర్, చెహ్రే వంటి చిత్రాలలో నటించాడు.

Updated Date - 2022-06-13T16:29:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!