సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tiger Shroff: టైగర్ ష్రాప్‌కు జోడీగా శ్రద్ధా కపూర్..?

ABN, First Publish Date - 2022-08-16T02:00:26+05:30

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ఈ మధ్యనే ‘హీరో పంటీ-2’ తో అభిమానులను అలరించాడు. టైగర్ చేతిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ఈ మధ్యనే ‘హీరో పంటీ-2’ తో అభిమానులను అలరించాడు. టైగర్ చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘స్క్రూ ఢీలా’, ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) వంటి చిత్రాలు చేయనున్నాడు. ‘బడే మియా, చోటే మియా’ లో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)తో కలసి నటించనున్నాడు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. అలీ అబ్బాస్ జాఫర్ (Ali Abbas Zafar) దర్శకత్వం వహించనున్నాడు. రూ. 350కోట్లను భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. 


‘బడే మియా, చోటే మియా’ లో టైగర్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) నటించనుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. శ్రద్ధ తన అంగీకారాన్ని ఇంతవరకు తెలపలేదని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఆమె నటిస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే. ‘‘శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. టైగర్‌కు జోడీగా శ్రద్ధ సరిపోతుందని ఆలోచిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారు’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి తెలిపారు. గతంలో శ్రద్ధ, టైగర్ కలసి ‘బాఘీ’ (Baaghi)లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ‘బడే మియా చోటే మియా’ను 2023, ఫిబ్రవరిలో పట్టాలెక్కించే అవకాశం ఉంది. అదే ఏడాది క్రిస్‌మస్ కానుకగా మూవీని విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-08-16T02:00:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!