Celebrities: సెలబ్రిటీ బాడీగార్డ్స్‌కు షాకింగ్ శాలరీలు..

ABN , First Publish Date - 2022-11-25T01:58:37+05:30 IST

బాలీవుడ్‌ హీరో, హీరోయిన్స్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులందరు ఆటోగ్రాఫ్స్‌ కోసం ఎగబాకుతుంటారు. ఒంటరిగా బయటకు వెళ్లడం వారికి దాదాపు అసాధ్యం.

Celebrities: సెలబ్రిటీ బాడీగార్డ్స్‌కు షాకింగ్ శాలరీలు..

బాలీవుడ్‌ హీరో, హీరోయిన్స్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులందరు ఆటోగ్రాఫ్స్‌ కోసం ఎగబాకుతుంటారు. ఒంటరిగా బయటకు వెళ్లడం వారికి దాదాపుగా అసాధ్యం. అందువల్ల వారు రక్షణగా తమ వెంట ఎల్లప్పుడు బాడీగార్డ్స్‌ను ఉంచుకుంటారు. రక్షణను కల్పించినందుకు ఈ బాడీగార్డ్స్‌ కోసం వారు కోట్లల్లోనే పారితోషికం చెల్లిస్తారు. అయితే, ఈ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకునే రెమ్యూనరేషన్‌పై ఓ లుక్కేద్దామా..


అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) : 

కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). కెబీసీ హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తుంటాడు. జితేంద్ర షిండే (Jitendra Shinde) బిగ్ బీకి బాడీగార్డ్‌గా పనిచేస్తుంటాడు. జితేంద్ర ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతుంటాడు. ఈ ఏజెన్సీ తరఫున సెక్యూరిటీ సేవలు అందిస్తుంటాడు. రక్షణ కల్పించినందుకు అమితాబ్ ఏడాదికి రూ.1.5కోట్లను చెల్లిస్తాడని సమాచారం. 


షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) :

రవీ సింగ్ అనే వ్యక్తి అన్ని కార్యక్రమాల్లోను షారూఖ్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా సేవలు అందిస్తుంటాడు. అందుకు గాను కింగ్ ఖాన్ ఏడాదికి రూ.2.7కోట్లు చెల్లిస్తాడని తెలుస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్ రవీ సింగేనట. 


సల్మాన్ ఖాన్ (Salman Khan) :

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడిగా సల్మాన్ ఖాన్‌కు పేరుంది. సల్లూ భాయ్‌కు షేర్ షా రక్షణ కల్పిస్తుంటాడు. రక్షణ కల్పించినందుకు సల్మాన్ ఏడాదికి రూ.2కోట్లు చెల్లిస్తాడట. 


దీపికా పదుకొణె (Deepika Padukone) :

బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి దీపికా పదుకొణె. దీపికకు జలాల్ బాడీగార్డ్‌గా వ్యవహరిస్తుంటాడు. అందుకు గాను అతడికి రూ.1.2కోట్లను దీపిక చెల్లిస్తుందట.


ఆమిర్ ఖాన్ (Aamir Khan) :  

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు యువరాజ్ గొర్పడే రక్షణ కల్పిస్తుంటాడు. అందుకు గాను ఏడాదికి రూ.2కోట్లను తీసుకుంటాడని సమాచారం. 


Updated Date - 2022-11-25T01:58:37+05:30 IST

Read more