సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranbir Kapoor-Alia Bhatt Wedding: రిపోర్టర్ ప్రశ్నకి శిల్పాశెట్టి ఫన్నీ రియాక్షన్.. నటి ఏమందంటే..

ABN, First Publish Date - 2022-04-11T16:51:04+05:30

బాలీవుడ్‌లో ఎక్కడా చూసిన చర్చ మొత్తం లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చుట్టే తిరుగుతోంది. త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో ఎక్కడా చూసిన చర్చ మొత్తం లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చుట్టే తిరుగుతోంది. త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో చోట వారు మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. అంతేకాకుండా వారి సన్నిహితులు, స్నేహితులకి వారి పెళ్లి గురించే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి పశ్నలే ప్రముఖ నటి శిల్పా శెట్టికి ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో.. శిల్పా శెట్టి ముంబైలోని ఓ మల్టీప్లెక్స్‌ దగ్గర మీడియా కంటపడింది. దీంతో  రణ్‌బీర్, అలియా పెళ్లి గురించి, రూమర్స్ గురించి ఓ రిపోర్టర్ స్పందించమని అడిగాడు. దీంతో శిల్పా నవ్వుతూ కొడతా అన్నట్లు చేయి చూపించింది. అంతేకాకుండా.. ‘నోర్మూయండి.. వారి పెళ్లి గురించి నాకేం తెలుసు.. నేనేం చెప్పాలి. దాని గురించి వదిలేయండి భయ్యా’ అంటూ నవ్వుతూ చెప్పి కారు ఎక్కి వెళ్లిపోయింది. దీంతో ఈ వైరల్ వీడియోపై చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-11T16:51:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!