Shehnaaz Gill: ఫ్యాన్‌ను ఫిదా చేసిన హీరోయిన్

ABN , First Publish Date - 2022-11-27T02:06:26+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా మారిన అందాల భామ షెహనాజ్ గిల్ (Shehnaaz Gill). పలు మ్యూజిక్ వీడియోస్, టెలివిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది.

Shehnaaz Gill: ఫ్యాన్‌ను ఫిదా చేసిన హీరోయిన్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా మారిన అందాల భామ షెహనాజ్ గిల్ (Shehnaaz Gill). పలు మ్యూజిక్ వీడియోస్, టెలివిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. పంజాబీకి చెందిన అనేక చిత్రాల్లో నటించింది. హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొనడంతోనే ఆమెకు యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇస్తుంది. షెహనాజ్ తాజాగా తన ఫ్యాన్‌ను ఫిదా చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.    


షెహనాజ్ గిల్ తాజాగా బయటికి వచ్చింది. ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్ ఆమెను కలిసింది. ఆనందబాష్పాలు రాల్చింది. కాసేపు ముచ్చటించింది. ఫ్యాన్ మోకాళ్లపై కూర్చొని బంగారు బ్రాస్‌లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ సందర్భంగా షెహనాజ్.. మోకాళ్లపై కూర్చోకూడదని అభిమానిని వారించింది. సంభాషణ కొనసాగుతుండగానే షెహనాజ్ సెక్యూరిటీ గార్డు అభిమానిని తప్పించేందుకు ప్రయత్నించింది. అప్పుడు నటి.. సెక్యూరిటీని ఆ విధంగా చేయొద్దని కోరింది. అనంతరం ఈ అందాల భామ ప్యాన్ ఇచ్చిన బ్రాస్‌లేట్‌ను తీసుకుంది. అభిమానిని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. షెహనాజ్ అభిమానులందరు షేర్ చేస్తున్నారు. గతంలో షెహనాజ్‌కు ఇటువంటి అనుభవమే దుబాయ్‌లో ఎదురైంది. యూఏఈకి రావడంతో కొంత మంది ఫ్యాన్స్ ఆమెను చూడటానికి కెనడా నుంచి వచ్చారు. ఓ ఫొటో తీసుకోవాలని అంత దూరం నుంచి వచ్చారు. అప్పుడు కూడా షెహనాజ్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది.



Updated Date - 2022-11-27T02:06:26+05:30 IST