Shehnaaz Gill: ఏడాది క్రితం ప్రియుడు మరణం.. తొలిసారి స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-08-23T21:17:51+05:30 IST

హిందీ బిగ్‌బాస్‌ సీజన్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొని పాపులారిటీ సాధించిన నటి షెహనాజ్ గిల్..

Shehnaaz Gill: ఏడాది క్రితం ప్రియుడు మరణం.. తొలిసారి స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ

హిందీ బిగ్‌బాస్‌ సీజన్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొని పాపులారిటీ సాధించిన నటి షెహనాజ్ గిల్ (Shehnaaz Gill). ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా(Sidharth Shukla)కి ఈ నటికి బిగ్‌బాస్ ఇంట్లోనే మంచి రిలేషన్‌షిప్ ఏర్పడింది. అక్కడ ఏర్పడిన బంధం ఆ హౌజ్‌లోంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగింది. ఈ తరుణంలోనే గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటు కారణంగా సిద్ధార్థ్ హఠాన్మరణం చెందాడు.


దాంతో షెహనాజ్ కన్నీరు మున్నీరైంది. ఈ జంట అభిమానులు సైతం షాక్‌కి లోనయ్యారు. కానీ.. ఎప్పుడూ కూడా మీడియా ముందు ఈ విషయం స్పందించలేదు. ఆయన మరణించి ఏడాది కావొస్తోంది. ఈ తరుణంలో ఆ బ్యూటీ మొదటిసారి తన ప్రియుడి మరణం గురించి స్పందించింది. షెహనాజ్ మాట్లాడుతూ.. ‘మీరు బహిరంగంగా ఏడుస్తుంటే, మీరు సానుభూతి కోసం అలా చేస్తున్నారని జనాలు అనుకుంటారు. లేకపోతే మిమ్మల్ని బలహీనంగా ఉన్నారని భావిస్తారు. నేను ఎప్పుడూ ఒకరిగా కనిపించకూడదనుకుంటాను. అయితే, నేను ఎప్పుడూ నా భావోద్వేగాలను దాచడానికి ప్రయత్నించలేదు. అన్నింటినీ నేనే డీల్ చేశాను. అయినా బాగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా.. సిద్ధార్థ్ మరణం తర్వాత దాదాపు నెలరోజులపాటు షెహనాజ్ మీడియాకి చాలా దూరంగా ఉంది. అనంతరం తన పనిలో పడిపోయింది. ఈ తరుణంలో ఓ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట ప్రత్యక్షం అయ్యాయి. ఇది నచ్చని కొందరూ నెటిజన్లు ఆమె సిద్ధార్థ్ మరణాన్ని ఉపయోగించుకుని కెరీర్ సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై షెహనాజ్ స్పందిస్తూ.. ‘జనాలకు అసలు స్టోరీ తెలియదు. కాబట్టి వారు దాని గురించి చాలా మాట్లాడతారు. దాదాపు నెలరోజుల తర్వాత నేను నా పనిని ప్రారంభించాలనుకున్నాను. తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకున్నాను. మీకు ఎవరిమీదైనా చాలా గౌరవం ఉన్నప్పుడు.. మీరు వారి కోసం ఏదైనా చేయకపోతే, అందరికీ ఎలా తెలుస్తుంది. సిద్ధార్థ్ మీ గౌరవంతోనే నా కెరీర్‌పై తిరిగి దృష్టి పెట్టాను. కాబట్టి నా గురించి ఏమీ తెలియని వాళ్లు మాట్లాడిన మనం ఎందుకు బాధపడాల్సిన పని లేదు. వారిని అలాగే ఉండనివ్వండి’ అని సెటైరికల్‌గా తెలిపింది.

Updated Date - 2022-08-23T21:17:51+05:30 IST