సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shah Rukh Khan కృతజ్ఞతలు కూడా చెప్పలేదన్న Shatrughan Sinha.. ఫోన్ చేయాల్సిన అవసరం లేదంటూనే..

ABN, First Publish Date - 2022-06-08T19:41:40+05:30

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు గురించి తెలిసిందే. గతేడాది బాంబేలోని క్రూయిజ్ షిప్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు గురించి తెలిసిందే. గతేడాది బాంబేలోని క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ ఉపయోగించాడనే నెపంతో ఆర్యన్‌తోపాటు మరికొందరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంలో అరెస్టు విషయమై ఆర్యన్‌కి శత్రుఘ్న సిన్హా, హృతిక్ రోషన్‌తో సహా పలువురు బాలీవుడ్ తారలు మద్దతు పలికారు. ఆ బాలీవుడ్ ప్రముఖులు ఏజెన్సీని బహిరంగంగా విమర్శిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఇటీవలే ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్‌కి ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.


ఈ తరుణంలో శత్రుఘ్న సిన్హా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేసు విషయంలో ఆర్యన్‌కి మద్దతు నిలిచినందుకు షారుఖ్ ఖాన్ తనకు ధన్యవాదాలు చెప్పలేదని ఈ సినీయర్ నటుడు తెలిపారు. ఆ సమయంలో ఓ తండ్రిగా షారుఖ్ బాధ తనకి తెలుసని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్యన్ దోషి అయ్యిండొచ్చు. కానీ.. అతనికి పునరావాసం కల్పించి చికిత్స ఇప్పించకుండా.. అతన్ని లాకప్‌లో వేశారు. అయితే నేను ఊహించినట్లుగానే.. షారూఖ్ నుంచి నాకు ఎటువంటి స్పందన రాలేదు. అయినప్పటికీ.. ముంబైలోనే ఆర్యన్‌కి గట్టిగా మద్ధతు తెలిపింది నేను మాత్రమే. ఎవరూ ఏమనుకున్నా న్యాయం వైపు, అన్యాయానికి ఎదురుగా నిలబడడమే నాకు అలవాటు’ అని చెప్పుకొచ్చారు.


శత్రుఘ్నని షారుఖ్‌తో మాట్లాడారా అని అడగగా.. ‘లేదు. నేను ఎందుకు మాట్లాడాలి. నాకు ఆయనతో ఎటువంటి పని లేదు. నాకు ఆయనతో సన్నిహితంగా ఉండవలసిన అవసరం లేదు. నిజానికి.. ఆయన నాతో సన్నిహితంగా ఉండాలి. కానీ, ఆర్యన్ విషయంలో న్యాయం కోసం ఆయన నా మద్దతు సైతం కోరలేదు’ అని తెలిపారు.

Updated Date - 2022-06-08T19:41:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!