Shamshera Collections: మొదటి రోజు Shamshera సినిమాకు దారుణంగా కలెక్షన్లు.. ప్రేక్షకులు లేక షో లు రద్దు..!
ABN , First Publish Date - 2022-07-23T20:51:38+05:30 IST
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. వాణీ కపూర్ (Vaani Kapoor) హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. వాణీ కపూర్ (Vaani Kapoor) హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ రూ. 150కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. భారీ అంచనాల మధ్య జులై 22న ఈ సినిమా విడుదల కాగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
‘షంషేరా’ ను 4000 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్‌కు పుల్జోష్ వస్తుందని అందరు ఆశించారు. కానీ, చిత్రం విడుదలైన తొలి రోజే నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. మౌత్‌టాక్ బాగా లేదు. అందువల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ‘షంషేరా’ తొలి రోజు రూ. 10.25కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. సినిమా విడుదలైన థియేటర్స్‌తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రేక్షకులు లేక షోలు కూడా రద్దు చేశారు. ముంబైలో ఈ షోలు ఎక్కువగా రద్దయినట్టు సమాచారం. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘జయేష్ భాయ్ జోర్దార్’ తర్వాత ఈ ఏడాది యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఎదురైన మరో ప్లాప్ ఇది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రణ్‌బీర్ కపూర్ మరో భారీ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నాడు. ఆలియా భట్‌కు జోడీగా ‘బ్రహ్మాస్త్ర’ లో నటించాడు. ‘బ్రహ్మాస్త్ర’ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబరు 9న విడుదల కానుంది.