సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shraddha Kapoor మమ్మీ, డాడీ లవ్ మ్యారేజ్‌కి... లతా మంగేష్కర్‌కి... లింకేంటో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-14T00:56:04+05:30

భారతరత్న లతా మంగేష్కర్ ఈ మధ్యే పరమపదించారు. తరువాత చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే, శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ ఓ ఇంటర్వ్యూలో లతాతో అనుబంధాన్నే కాదు బంధుత్వాన్ని కూడా ప్రస్తావించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్. ఆయన భార్య శివాంగీ కొల్హాపురి. వారిది కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమే. శివాంగీ కొల్హాపురికి అలనాటి బాలీవుడ్ నటి పద్మినీ కొల్హాపురి స్వంత చెల్లెలు. అంటే, శ్రద్ధా కపూర్‌కి ఆమె పిన్ని వరుస అన్నమాట. ఇక శ్రద్ధా కపూర్‌కి, దివంగత లతా మంగేష్కర్‌కి కూడా బంధుత్వం ఉంది. లెజెండ్రీ సింగర్ కి శ్రద్ధా తల్లి శివాంగీ కపూర్ తన తండ్రి తరుఫున బంధువు. షార్ట్‌గా చెప్పుకుంటే... లతా మంగేష్కర్‌కి ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా మనవరాలు అవుతుంది... 


భారతరత్న లతా మంగేష్కర్ ఈ మధ్యే పరమపదించారు. తరువాత చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే, శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ ఓ ఇంటర్వ్యూలో లతాతో అనుబంధాన్నే కాదు బంధుత్వాన్ని కూడా ప్రస్తావించారు. తమది ప్రేమ వివాహం అని చెప్పిన ఆయన, అప్పట్లో... శివాంగీ కొల్హాపురీతో కలసి తాను ఇంటి నుంచీ పారిపోవాల్సి వచ్చిందని వివరించారు. శివాంగీ కుటుంబం తమ పెళ్లికి ఒప్పుకోకపోవటంతో బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నామని శక్తి కపూర్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే, పెళ్లి తరువాత అమ్మాయి తరుఫు వారికే కాదు... ఢిల్లీలో ఉన్న శక్తి కపూర్ తండ్రికి కూడా బాగా కోపం వచ్చిందట. ఆయన కొడుకుతో ఇక ఎప్పటికీ మాట్లాడవద్దని నిర్ణయించుకున్నాడట. 


శక్తి కపూర్ పెళ్లి తరువాత కొడల్ని ఒకసారి చూడనైతే చూడమని అతడి తల్లి తండ్రికి నచ్చజెప్పింది. దాంతో ఆయన ముందుకు వచ్చిన శ్రద్ధా తల్లి శివాంగీ కొల్హాపురి మాటల మధ్యలో ఓ పాట పాడాల్సి వచ్చింది. ఆమె శ్రావ్యంగా పాడటంతో ఆశ్చర్యపోయిన శక్తి కపూర్ తండ్రి మరింత ఆరా తీశారు. చివరకు, ఆమె లతా మంగేష్కర్‌కి దగ్గరి బంధువని తేలింది. ఇంకేముంది... గాన కోకిలకి పెద్ద ఫ్యాన్ అయిన శక్తి కపూర్ తండ్రి... అమాంతం కొడుకుని వాటేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప కుటుంబంలో పుట్టిన అమ్మాయిని కోడలిగా తెచ్చినందుకు ‘అన్ని తప్పుల్ని’ క్షమించేశానన్నారు. అలా తమ ప్రేమ పెళ్లి వ్యవహారం... లతా మంగేష్కర్ చలువతో... సుఖాంతమైందని శ్రద్ధా కూపూర్ తండ్రి దశబ్దాల నాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నారు. 


లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించటంతో కొద్ది రోజుల క్రితం ఆమె హాస్పిటల్లో ఉండగా శ్రద్ధా కపూర్, ఆమె తల్లి ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు. అలాగే, లతా అంత్యక్రియలకు కూడా ముంబైలోని శివాజీ పార్క్‌లో శ్రద్ధా హాజరైంది.    

Updated Date - 2022-02-14T00:56:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!