Aryan Khan: షారూఖ్ ఖాన్ తనయుడి ఎంట్రీ.. హీరోగా మాత్రం కాదండోయ్..
ABN, First Publish Date - 2022-08-11T21:43:50+05:30
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆర్యన్ కొన్ని రోజులు జైలులో కూడా గడిపాడు.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆర్యన్ కొన్ని రోజులు జైలులో కూడా గడిపాడు. అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో ఆర్యన్‌పై కేసును కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆర్యన్ కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తండ్రి బాటలోనే నడుస్తూ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిత్ర పరిశ్రమకు ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు. రైటర్‌గా అరంగ్రేటం చేయనున్నాడు. అతడు ఓ వెబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేస్తున్నాడట. అది కామెడీ కథ అని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ కథ రియల్ లైఫ్ అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని రాస్తున్నాడట. ఆర్యన్ మరో రెండు, మూడు నెలల్లో స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ వదంతులు కనుక నిజమైతే 2023 ప్రథమార్థంలో వెబ్‌సిరీస్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘‘ఆర్యన్ ఖాన్ ఓ వెబ్‌సిరీస్‌కు కామెడీ కథను రాస్తున్నాడు. ఈ సిరీస్‌కు ఆర్యన్ దర్శకత్వం వహించే అవకాశం లేదు. ముంబై చిత్ర పరిశ్రమ నేపథ్యంలో ఫన్నీగా కథ ఉండనుంది. షారూఖ్ ఖాన్ కుమారుడిగా ఆర్యన్‌కు సినీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసు. అందువల్ల ఇండస్ట్రీని ఆధారంగా చేసుకుని కథను రాస్తున్నాడు’’ అని ఆర్యన్‌తో సన్నిహితంగా మెలిగే వర్గాలు పేర్కొంటున్నాయి. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ (Suhana Khan) కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ది అర్చీస్’ వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తుంది. అమెరికన్ కామిక్ సిరీస్ ‘ది అర్చీస్’ ను ఆధారంగా చేసుకుని అదే పేరుతో ఇండియన్ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిర్మిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తుంది.