Aryan Khan: మెగా ఫోన్ పట్టుకొబోతున్న షారూఖ్ కుమారుడు

ABN , First Publish Date - 2022-12-07T22:30:33+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు.

Aryan Khan: మెగా ఫోన్ పట్టుకొబోతున్న షారూఖ్ కుమారుడు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు. ఈ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి అతడు కొత్తగా కెరీర్‌ను మొదలుపెట్టనున్నాడు. మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా మారనున్నాడు.  


ఆర్యన్ ఖాన్ ఓ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే స్క్రిఫ్ట్‌ వర్క్‌ను పూర్తి చేశాడు. అతి త్వరలోనే రోల్, కెమెరా, యాక్షన్ అని చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాను రాసిన స్క్రిఫ్ట్‌ను ఫొటో తీసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌తో పంచుకున్నాడు. ‘‘రైటింగ్ పూర్తయింది. యాక్షన్ చెప్పడానికి వేచి చూస్తున్నాను’’ అని ఆర్యన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఆర్యన్ ఖాన్ పోస్ట్‌కు షారూఖ్ రిప్లై ఇచ్చాడు. ‘‘ఓ ఐడియాను నమ్మి, ఆలోచించి కలను నిజం చేసుకోబోతున్నావు. నువ్వు డైరెక్ట్ చేయబోయే ప్రాజెక్టుకు శుభాకాంక్షలు. మొదటిది ఎప్పుడు ప్రత్యేకమైనదే’’ అని షారూఖ్ స్పందించాడు. ‘‘నీ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ తెలిపింది. ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ కుడా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. జోయా అక్తర్ దర్శకత్వంలో సుహానా నటిస్తుంది. ‘ది అర్చీస్’ (The Archies) వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రను పోషిస్తుంది. అర్చీ గర్ల్ ఫ్రెండ్ రోల్‌లో ఆమె కనిపిస్తుంది. ఈ కామిక్ సిరీస్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - 2022-12-07T22:30:33+05:30 IST