సౌదీ అరేబియా మంత్రితో బాలీవుడ్ సూపర్ స్టార్స్ భేటీ

ABN , First Publish Date - 2022-04-03T21:15:34+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది

సౌదీ అరేబియా మంత్రితో బాలీవుడ్ సూపర్ స్టార్స్ భేటీ

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోను కింగ్ ఖాన్‌కు అభిమానులున్నారు. షారూఖ్ తాజాగా సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్‌తో భేటీ అయ్యారు. షారూఖ్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ తదితరులంతా సమావేశంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 


సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్‌ ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్‌ను కలవడం సంతోషదాయకం అన్నారు. హీరోలతో కలసి భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘టైగర్-3’, ‘కబీ ఈద్, కబీ దివాళీ’ ప్రాజెక్టులు సల్మాన్ ఖాన్ చేతిలో ఉన్నాయి. ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’ చిత్రాల్లో అక్షయ్ అలరించనున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న‘ఆది పురుష్’ చిత్రంలో సైఫ్ విలన్‌గా కనిపించనున్నారు.
Updated Date - 2022-04-03T21:15:34+05:30 IST

Read more