తిండి మానేసి మరీ రోజుకు 100 సిగరెట్లు.. 30 బ్లాక్ కాఫీలు.. Shah Rukh Khan చెప్పిన నిజాలివి..!

ABN , First Publish Date - 2022-05-08T00:46:52+05:30 IST

తన స్మోకింగ్ అడిక్షన్ గురించి Shah Rukh Khan గతంలో చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడాడు. 2011లోనూ అటువంటి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. తాను రోజుకు 100 సిగరెట్లు కాలుస్తాననీ, 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగుతాననీ చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు!

తిండి మానేసి మరీ రోజుకు 100 సిగరెట్లు.. 30 బ్లాక్ కాఫీలు.. Shah Rukh Khan చెప్పిన నిజాలివి..!

తన స్మోకింగ్ అడిక్షన్ గురించి Shah Rukh Khan గతంలో చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడాడు. 2011లోనూ అటువంటి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. తాను రోజుకు 100 సిగరెట్లు కాలుస్తాననీ, 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగుతాననీ చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు!


కింగ్ ఖాన్ తన 2011 ఇంటర్వ్యూలో సిగరెట్లు, కాఫీల గురించే కాదు ఆహారం గురించి కూడా చెప్పుకొచ్చాడు. తన తండ్రికి ఢిల్లీలో రెస్టారెంట్స్ ఉండేవని తెలిపాడు. నాన్న పఠానీ ఫుడ్ స్పెషలిస్ట్ అయితే, అమ్మ హైద్రాబాదీ ఆహారం గొప్పగా వండేదని గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు, షారుఖ్ తల్లి ఆమె బ్రతికి ఉన్నంత కాలం తన చేతులతో కొడుక్కి తినిపించేదట! 


Harper’s Bazaar కోసం అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఆర్కే అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘మా నాన్నకి రెస్టారెంట్స్ ఉండేవి. మేము కొన్ని రెస్టారెంట్స్ కి యజమానులం అని చెప్పవచ్చు. బటర్ చికెన్, నాన్ వంటివి నాకు ఇంకా గుర్తు. అమ్మ, నాన్న ఇద్దరూ వంట చేసేవారు. నాన్న వంటకాల్లో పఠానీ ఫుడ్ స్పెషల్. అమ్మది హైద్రాబాదీ ఆహారంలో ప్రత్యేకత. అన్ని రకాల హైద్రాబాదీ వంటకాలు అమ్మ చేసేది. అందుకే, నేను రెస్టారెంట్స్ ను ఇష్టపడను. చాలా కాలం అమ్మ, నాన్న చేతుల మీదుగా ఆహారం తిన్నందు వల్ల... ’’ అన్న షారుఖ్ ఖాన్ తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తనకు 26 ఏళ్లు వచ్చే వరకూ కూడా అమ్మే ఆహారం కలపి చేతికి ఇచ్చేదట. అలా చెప్పుకోటానికి తానేం సిగ్గుపడనని కూడా బాలీవుడ్ బాద్షా చెప్పాడు. కానీ, చాలా రోజులు తల్లి చేతి తిండికే అలవాటు పడ్డ ఆయన ఇప్పటికీ స్వంతంగా కలుపుకుని తినలేడట. అందుకే, రెస్టారెంట్స్ కి కూడా వెళ్లడట. తనని చూస్తే ఎవరైనా చదవు, సంధ్యలు లేని వాడనుకుంటారని హోటల్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉంటాడట. 


తనకు తినటం రాదన్న షారుఖ్ ఖాన్ చాలా సార్లు అసలు తినటమే మరిచిపోతుంటానని కూడా చెప్పాడు! నిద్ర, ఆహారపు అలవాట్ల గురించి వివరిస్తూ ‘‘నేను పెద్దగా నిద్రపోను. రోజుకు వంద సిగరెట్ల వరకూ కాలుస్తాను. ఆహారం తీసుకోవాలన్న సంగతే మరిచిపోతుంటాను. గుర్తు పెట్టుకుని తినాల్సి వస్తుంటుంది. షూటింగ్ మధ్యలో ఉండగా తినాలనే విషయం జ్ఞాపకం వస్తుంది... నేను నీళ్లు కూడా తాగను. రోజుకు 30 కప్పుల బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అయినా నాకు సిక్స్ ప్యాక్ బాడీ ఉంది! సో... నా గురించి నేను ఎంత తక్కువగా కేర్ తీసుకుంటానో... అంత ఎక్కువగా కేర్ తీసుకోబడుతుంటాను!’’ అంటూ ముగించాడు!


షారుఖ్ ఖాన్ చైన్ స్మోకింగ్, కాఫీ అలవాట్లపై చాలా రోజులు చాలా మంది ఆందోళన వ్యక్తం చేయటంతో ఆయన గత కొంత కాలంగా రెండు వ్యసనాల్ని బాగా తగ్గించుకున్నాడు. గతంలో మాదిరిగా ఇప్పుడు కింగ్ ఖాన్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం లేదనే చెప్పాలి. అందుకే, 56 ఏళ్లు వయస్సులోనూ ‘పఠాన్’ సినిమా కోసం కండలు తిరిగిన శరీరంతో ఫిట్ అండ్ పర్ఫెక్ట్ గా రంగంలోకి దిగాడు! తనకంటే సగం వయస్సున్న హీరోయిన్లతో కూడా రొమాన్స్ చేయగలుగుతున్నాడు... 

Updated Date - 2022-05-08T00:46:52+05:30 IST

Read more