Sara Ali Khan: టైగర్ ష్రాఫ్‌కు జోడిగా సారా

ABN , First Publish Date - 2022-12-02T00:02:35+05:30 IST

సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). ‘కేదార్‌నాథ్’ (Kedarnath) చిత్రంతో వెండితెరపైకి రంగ ప్రవేశం చేసింది.

Sara Ali Khan: టైగర్ ష్రాఫ్‌కు జోడిగా సారా

సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). ‘కేదార్‌నాథ్’ (Kedarnath) చిత్రంతో వెండితెరపైకి రంగ ప్రవేశం చేసింది. ‘సింబా’, ‘లవ్ అజ్ కల్’, ‘కూలీ నెం 1’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని ఆమె చేజిక్కించుకుంది. 


బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కు జోడిగా సారా అలీ ఖాన్ నటించనుంది. ఈ మూవీకి జగన్ శక్తి దర్శకత్వం వహించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఇండియాతో పాటు యూరప్‌లో సినిమా చిత్రీకరణను చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ 10 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూవీ టైటిల్‌ను త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారు. ‘‘టైగర్ ష్రాఫ్‌కు జోడిగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారు. సారా అలీఖాన్‌తో టైగర్ ష్రాఫ్ ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అందువల్లే ఆమె‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను జగన్ శక్తి నెక్ట్స్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు. మూవీలో ప్రతినాయకుడి పాత్ర చాలా బలంగా ఉంటుంది. అందుకోసం నిర్మాతలు పలువురితో చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ మొదటివారంలో సినిమ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి తెలిపారు. కెరీర్ పరంగా సారా అలీఖాన్, టైగర్ ష్రాఫ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘గణపత్’, ‘బడే మియా, చోటే మియా’ లో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. విక్కీ కౌశల్‌తో సారా అలీ ఖాన్ ఓ చిత్రం చేస్తుంది. కరణ్ జోహార్‌ ప్రొడక్షన్స్‌లో మరో రెండు ప్రాజెక్టుల్లో నటించనుంది. 

Updated Date - 2022-12-02T00:02:35+05:30 IST

Read more