Sara Ali Khan: ర్యాంప్ వాక్ చేసిన సారా.. సవతి తల్లిని చూసి నేర్చుకోమంటూ ట్రోలింగ్
ABN, First Publish Date - 2022-12-19T10:36:18+05:30
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి సారా అలీఖాన్ (Sara Ali Khan). ఆమె తల్లి అమృతా సింగ్ (Amrita Singh) కూడా మంచి నటే.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి సారా అలీఖాన్ (Sara Ali Khan). ఆమె తల్లి అమృతా సింగ్ (Amrita Singh) కూడా మంచి నటే. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) సినిమా ‘కేదార్‌నాథ్’ (Kedarnath)తో పరిచయమై వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపుని సాధించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ ఎన్నో ప్రముఖ ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఈ బ్యూటీ తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో బ్లాక్ స్టేట్‌మెంట్ పెప్సీ లోగో ఉన్న బ్లేజర్ ధరించింది. అయితే.. ఈ ఆమె వాక్ చేసిన విధానం కొంతమందికి నచ్చలేదు. దీంతో ఈ బ్యూటీని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘సారా విచిత్రంగా నడుస్తోంది. ఎలా ర్యాంప్ వాక్ చేయాలో తన సవతి తల్లి కరీనా కపూర్‌ని చూసి నేర్చుకుంటే బావుంటుంది’.. ‘ఇది చూస్తే తనకి ర్యాంప్ వాక్ ఎలా చేయాలో తెలియదని కచ్చితంగా అర్థమవుతోంది’.. ‘చాలా చెత్తగా ఉంది’.. ‘డ్రెస్ బావుంది కానీ.. నడక మాత్రం చెత్తగా ఉంది’ అని వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.