ఒక్క నిమిషం కుస్తీ కోసం... 10 నెలల పాటూ చెమటోడ్చిందట!

ABN , First Publish Date - 2022-01-07T00:34:31+05:30 IST

2016లో విడుదలైన ‘దంగల్’ సినిమాలో రెస్లర్‌ బబితా కుమారిగా నటించింది సాన్యా మల్హోత్రా. అయితే, ఆ సినిమాలో ఆమె కుస్తీ పట్టాల్సి ఉండటంతో పది నెలల పాటూ సాధన చేసిందట. కానీ, తెర మీద ఆమె రెస్లింగ్ సీన్ ఎంత సేపు ఉంటుందో తెలుసా? కేవలం ఒక్క నిమిషం మాత్రమే!

ఒక్క నిమిషం కుస్తీ కోసం... 10 నెలల పాటూ చెమటోడ్చిందట!

2016లో విడుదలైన ‘దంగల్’ సినిమాలో రెస్లర్‌ బబితా కుమారిగా నటించింది సాన్యా మల్హోత్రా. అయితే, ఆ సినిమాలో ఆమె కుస్తీ పట్టాల్సి ఉండటంతో పది నెలల పాటూ సాధన చేసిందట. కానీ, తెర మీద ఆమె రెస్లింగ్ సీన్ ఎంత సేపు ఉంటుందో తెలుసా? కేవలం ఒక్క నిమిషం మాత్రమే! 


‘‘అది నా మొదటి చిత్రం సమయంలో... నాపై నేను పెంచుకున్న ఒత్తిడి. నాకొచ్చిన అవకాశం పట్ల నేను సంపూర్ణ నిబద్ధతతో ఉండాలని భావించాను. అందుకే, ‘దంగల్’లో నేను రెస్లింగ్ చేసింది కేవలం ఒక్క నిమిషం మాత్రమే అయినా దాని కోసం నేను పది నెలల పాటూ సంసిద్ధమవుతూ వచ్చాను. ‘దంగల్’ లాంటి అరుదైన చిత్రం చేజారిపోకూడదని నా వైపు నుంచీ నేను ఎంతో ఒత్తిడికి లోనయ్యాను...’’ అంది సాన్యా మల్హోత్రా. ఆమె పడ్డ కష్టం సినిమా విడుదల తరువాత గొప్ప గుర్తింపునే తెచ్చి పెట్టింది. ‘దంగల్’ యాక్ట్రస్ తరువాత ‘ఫోటోగ్రాఫ్, బదాయి హో, శకుంతల దేవి’ లాంటి సినిమాలతో సత్తా చాటింది. నెక్ట్స్ మన తెలుగు ‘హిట్’ మూవీకి హిందీ రీమేక్‌గా వస్తోన్న ‘హిట్ : ద ఫస్ట్ కేస్’ చిత్రంలో సాన్యా కనిపించనుంది. 

Updated Date - 2022-01-07T00:34:31+05:30 IST