Heeramandi: దర్శకుడికి రూ.60కోట్లకు పైగా రెమ్యునరేషన్

ABN , First Publish Date - 2022-06-04T20:47:54+05:30 IST

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షోకు ‘హీరామండి’ (Heeramandi) అని

Heeramandi: దర్శకుడికి రూ.60కోట్లకు పైగా రెమ్యునరేషన్

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షోకు ‘హీరామండి’ (Heeramandi) అని టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందట. దాదాపుగా రూ. 200కోట్ల ఖర్చుతో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ బడ్జెట్‌లోనే రూ. 60కోట్ల నుంచి రూ.65కోట్ల వరకు భన్సాలీకీ రెమ్యునరేషన్‌గా చెల్లించనున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


‘హీరామండి’ లో  సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), మనీషా కొయిరాలా (Manisha Koirala), హ్యుమా ఖురేషీ (Huma Qureshi), రిచా చద్దా (Richa Chadha) తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. భారతదేశానికీ స్వాతంత్ర్యం రాకముందు వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నారు. ప్రేమ, ద్రోహం, రాజకీయాల నేపథ్యంగా ఈ షో కొనసాగబోతున్నట్టు సమాచారం. భన్సాలీ భారీస్థాయిలో సెట్స్ వేసి సినిమాలను నిర్మిస్తారని తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ వాటికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందట. సంజయ్ లీలా భన్సాలీ చివరగా ‘గంగూబాయి కతియావాడి’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు.

Updated Date - 2022-06-04T20:47:54+05:30 IST

Read more