మళ్లీ వెబ్ సిరీస్‌లో Samantha... బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోకు జోడీగా!
ABN , First Publish Date - 2022-03-16T03:12:23+05:30 IST
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ తరువాత సమంత మరోసారి వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా తన డిజిటల్ డెబ్యూ సూపర్బ్‌గా చేయించిన దర్శక ద్వయం రాజ్, డీకేనే ఆమే ఈసారి కూడా నమ్ముకుంటోంది. కాకపోతే, అసలు విశేషం ఏంటంటే... బీ-టౌన్ అందగాడు...
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ తరువాత సమంత మరోసారి వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా తన డిజిటల్ డెబ్యూ సూపర్బ్‌గా చేయించిన దర్శక ద్వయం రాజ్, డీకేనే ఆమే ఈసారి కూడా నమ్ముకుంటోంది. కాకపోతే, అసలు విశేషం ఏంటంటే... బీ-టౌన్ అందగాడు వరుణ్ ధవన్ మన స్యామ్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వారిద్దరి కాంబినేషన్లో రాజ్ అండ్ డీకే రూపొందించే లెటెస్ట్ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందట.
సమంత సెకండ్ వెబ్ సిరీస్ హైలైట్స్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్... ఇది హాలీవుడ్ జంట దర్శకులు ఆంథోని, జో రూసో రూపొందించిన ‘సిటాడెల్’ షోకి ఇండియన్ వర్షన్ కావటమే! అయితే, మార్చ్ 17న అంతర్జాతీయంగా ‘సిటాడెల్’ విడుదలవుతోంది. గ్లోబల్ వర్షన్లో మన గ్లోబల్ స్టార్ ప్రియాంక నటిస్తుండగా దేసీ స్పిన్ ఆఫ్‌లో సమంత థ్రిల్ చేయనుంది. ప్రస్తుతానికి ఆమె క్యారెక్టర్‌పై సస్పెన్స్ కొనసాగుతోన్నా ‘ఓ గూఢచారి’గా వెబ్ సిరీస్‌లో కనిపించనుందని టాక్. అది ఎంత వరకూ నిజమో ఇప్పుడే చెప్పలేం కానీ వరుణ్ ధవన్, సమంత స్టారర్ ‘సిటాడెల్’ ఇండియన్ వర్షన్ కొన్నాళ్ల తరువాత సెట్స్ మీదకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకులు రాజ్, డీకే విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కాంబినేషన్లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అది పూర్తయ్యాక స్యామ్తో తమ రెండో సీరిస్‌ను స్టార్ట్ చేస్తారు. చూడాలి మరి, వరుణ్ ధవన్‌తో ప్రాజెక్ట్ తరువాత మన సౌత్ ‘బేబీ’ క్రేజ్ బాలీవుడ్లో ఏ రేంజ్‌కు పెరుగుతుందో...