సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khan Remunaration: Bigg Boss 16 కు సల్మాన్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒక్కో సీజన్‌కు ఎంతెంత పెంచాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-19T20:51:29+05:30

పాపులర్ రియాలిటీ షోస్‌ల్లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటి. హిందీ బిగ్‌బాస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ షో 15సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ‘బిగ్ బాస్-16’ ( Bigg

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపులర్ రియాలిటీ షోస్‌ల్లో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) ఒకటి. హిందీ బిగ్‌బాస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ షో 15సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ‘బిగ్ బాస్-16’ ( Bigg Boss-16) ప్రసారం కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘బిగ్‌బాస్‌-16’ కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. సల్లూ భాయ్ 2010 నుంచి హోస్ట్ పాత్రను నిర్వహిస్తున్నాడు. ‘బిగ్‌బాస్‌’ కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు సల్మాన్ ఈ సారి భారీగా రెమ్యూనరేషన్‌ను తీసుకోబోతున్నాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ సీజన్ ద్వారా రూ. 1000కోట్లను అతడు అర్జించనున్నాడని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


‘బిగ్‌బాస్-4’ నుంచి ‘బిగ్‌బాస్-6’ వరకు అతడు ప్రతి ఎపిసోడ్‌కు రూ. 2.5కోట్లను పారితోషికంగా తీసుకున్నాడట. ‘బిగ్‌బాస్-7’ లోని ప్రతి ఎపిసోడ్‌కు రూ.5కోట్లను తీసుకున్నాడని సమాచారం. 8వ సీజన్‌లోని ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 5.5కోట్లను ఛార్జ్ చేశాడట. 9వ సీజన్‌లోని ప్రతి ఎపిసోడ్‌కు రూ. 7కోట్ల నుంచి రూ. 8కోట్లను రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడట. 10వ సీజన్‌లోని ఎపిసోడ్‌కు రూ. 8కోట్లను ఛార్జ్ చేశాడట. 11వ సీజన్‌లో ప్రతి ఎపిసోడ్‌కు రూ. 11కోట్లు, 12వ సీజన్‌కు రూ. 12కోట్లు, 13వ సీజన్‌లోని ఎపిసోడ్‌కు రూ. 13కోట్లను రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడట. ‘బిగ్‌బాస్-14’ లోని ప్రతి ఎపిసోడ్‌కు రూ. 20కోట్లను ఛార్జ్ చేశాడట. ‘బిగ్‌బాస్-15’ కు రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడని తెలుస్తోంది. ఈ సీజన్ మొత్తానికి గాను రూ. 350కోట్లను పారితోషికంగా తీసుకున్నాడట. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్-3’ (Tiger-3)లో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ (Katrina Kaif) హీరోయిన్‌గా నటిస్తుంది. రంజాన్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-08-19T20:51:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!