సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

bollywood star Salman Khan:లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుతో సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లైసెన్స్

ABN, First Publish Date - 2022-08-01T16:25:07+05:30

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్సు మంజూరు చేస్తూ ముంబయి పోలీసులు తాజాగా నిర్ణయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై పోలీసుల ఉత్తర్వులు

ముంబయి: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు(bollywood star Salman Khan) తుపాకీ లైసెన్సు(firearm license) మంజూరు చేస్తూ ముంబయి పోలీసులు(Mumbai police) తాజాగా నిర్ణయం తీసుకున్నారు.సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన నేపథ్యంలో అతనికి తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ ఖాన్ కు పడుతుందని బిష్ణోయ్ బెదిరిస్తూ రాసిన లేఖను సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ కు చేర్చారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు(firearm license) జారీ చేయాలని పెట్టిన వినతి లేఖకు ముంబయి జోనల్ డీసీపీ సిఫారసు చేశారు. 


సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంపు

బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో హీరో సల్మాన్ ఖాన్ కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.ముంబయి పోలీసులు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్సు జారీ చేసినా, ఆయన ఏ తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. సల్మాన్ రక్షణ కోసం 32 కాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్ ను కొనాలని ఆయుధ నిపుణులు సూచించారు. జూన్ 6వతేదీ నుంచి సల్మాన్ ఇంటివద్ద సాయుధ పోలీసులతో కూడిన వ్యాన్ ను ఉంచారు. ఇటీవల తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో బస చేయడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


ప్రైవేటు వ్యక్తుల బందోబస్తును ఏర్పాటు చేశారు. హోటల్ లో ఒక ఫ్లోరును ఆయనకు కేటాయించారు. షూటింగు కోసం హైదరాబాద్ నగరంలో తిరిగినపుడు సల్మాన్ కారుకు ముందూ వెనుకా ఎస్కార్టు కార్లు ఏర్పాటు చేశారు. ముంబయి నగరంలోనూ సల్మాన్ కు రక్షణ ఏర్పాట్లు చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారును కూడా ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-08-01T16:25:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!